నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరీ జగన్నాధ్, సత్య దేవ్, సముద్రఖని, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ
దర్శకత్వం : మోహన్ రాజా
నిర్మాతలు: రామ్ చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
రేటింగ్ : 3/5
ఆచార్యతో ప్రేక్షకులని నిరాశ పరిచారు చిరంజీవి. చరణ్ తో కలసి చేసిన ఈ సినిమా మెగా అభిమానులకు కూడా రుచించలేదు. ఈసారి లూసిఫర్ ని గాడ్ ఫాదర్ గా రిమేక్ చేశారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ రీమేక్‌గా మోహన్‌రాజా దీన్ని తెరకెక్కించారు. సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ లోకి రావడం అంచనాలని పెంచింది. లూసిఫర్ కథని తీసుకున్నాం కానీ స్క్రీన్ ప్లే మొత్తం ఫ్రెష్ గా చేశామని చెప్పారు దర్శకుడు మోహన్ రాజా ? మరి గాడ్ ఫాదర్ లో చేసిన మార్పులు ఏమిటి ? మలయాళం లూసిఫర్ మ్యాజిక్ గాడ్ ఫాదర్ లో రిపీట్ అయ్యిందా ?
కథ:
రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.ఆర్ ఆకస్మికంగా మరణిస్తాడు. ఆయన మరణం తర్వాత అధికారాన్ని హస్తగతం చేసుకుని సీఎం కావాలని అతడి అల్లుడు జైదేవ్ (సత్యదేవ్) భావిస్తాడు. జై దేవ్ చేస్తున్న కుట్రని బ్రహ్మ (చిరంజీవి) పసిగతాడు. జైదేవ్ సీఎం కాకుండా అడ్డు నిలబడతాడు. దీంతో పికేఆర్ కుటుంబాన్నే అంతం చేయాలని జైదేవ్ కుట్ర చేస్తాడు. మరి ఆ కుట్రలను బ్రహ్మ ఎలా ఎదుర్కొన్నాడు? సత్యప్రియ (నయనతార) బ్రహ్మకి మధ్య వున్న వైరం ఏమిటి ? ఇంతకీ బ్రహ్మకు, పీకేఆర్‌కు ఉన్న సంబంధం ఏంటి? మసూద్ భాయ్ (సల్మాన్) ఎవరు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
లూసిఫర్ లానే పీకేఆర్ మరణంతో సినిమా మొదలు పెట్టిన దర్శకుడు, ఒకొక్క పాత్రని వారి వెనుక వున్న ఉద్దేశాలని ఆసక్తికరంగా చూపించాడు. బ్రహ్మ పాత్ర ఎంట్రీతో కథలో జోష్ వస్తుంది. పార్టీ పగ్గాలు బ్రహ్మ చేపట్టకుండా జైదేవ్ చేసే పయత్నాలు, వాటిని బ్రహ్మ తిప్పి కొట్టడం ఇలా ఎత్తుకుపై ఎత్తుగా సాగుతుంది. ఇందులో బ్రహ్మ పై చేయి సాధిస్తుంటాడు. సత్యప్రియని పార్టీ లీడర్ ని చేయడం, జైల్లో బ్రహ్మ జైదేవ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా వుంటాయి. విరామం వరకూ ఎలాంటి ఒడిదుడుగులు లేకుండా ప్రయాణం సాగుతుంది. ఇంటర్వెల్ బాంగ్ లో సల్మాన్ ఖాన్ పాత్రని ఎంట్రీ చేయడం కూడా ఆసక్తిని పెంచింది.
అయితేసెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథ కొంత కుదుపులకు గురైయింది. జైదేవ్ నిజ స్వరూపం సత్యప్రియకి తెలిసిపోయిన తర్వాత క్లైమాక్స్ అర్ధమైపోతుంది. జైదేవ్ ని అంతం చేయడమే మిగింపని తెలిసిన తర్వాత క్లైమాక్స్ పై పెద్ద ఆసక్తి క్రియేట్ అవ్వదు. రాజకీయ నాయకులకు క్లాస్ పీకడం, మీడియాకి లెక్చర్లు ఇవ్వడం గాడ్ ఫాదర్ లో కొత్తగా చేర్చారు. అయితే అవి ఈ కథకు అంతగా బలం చేకూర్చలేదు. పతాక సన్నివేశాల్లో మెరుపులేవీ ఉండవు. చిరు పక్కన వుండగా , సల్మాన్ ఖాన్ ఒక్కరే యాక్షన్ చేయడం మాత్రం కాస్త కొత్తగా గాడ్ ఫాదర్ పవర్ కి తగ్గట్టు వుంటుంది.
నటీనటులు:
బ్రహ్మ పాత్రలో మాస్ లీడర్ గా చిరంజీవి ఒదిగిపోయారు. యాక్షన్ సీన్స్ లో తన మాస్ పవర్ ని చూపిస్తూ ఎమోషనల్ సీన్స్ లో తన అనుభవాన్ని చూపించారు. విలన్ జైదేవ్‌గా సత్యదేవ్ నటన ఆకట్టుకుంటుంది. సల్మాన్ ప్రజన్స్ అలరిస్తుంది. నయనతార, మురళీశర్మ, సునీల్, బ్రహ్మాజీ వారి పాత్రలకు న్యాయం చేశారు. నయనతార ఎమోషన్స్ అని చక్కగా పలికించింది. పూరి జగన్నాథ్ పాత్ర స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
టెక్నికల్ :
తమన్ బీజీఎం వావ్ అనిపించేలా చేశాడు. తమన్ మ్యూజిక్ లో యాక్షన్ సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయి. నీరవ్ షా సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. మాటల రచయిత లక్ష్మీ భూపాల డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. మిగతా నిర్మాణ విలువలకు వంకపెట్టలేం. దర్శకుడు మోహన్ రాజా లూసిఫర్ లో పెద్ద మార్పులు చేయకుండానే అదే మ్యాజిక్ ని ప్రజంట్ చేయడానికి ప్రయత్నించాడు. లూసిఫర్ చూడని వారికి గాడ్ ఫాదర్ కొత్తదనం వున్న సినిమాగానే అనిపిస్తుంది. అయితే చిరంజీవి నుండి డ్యాన్సులు, మాస్ యాక్షన్, వినోదం ఆశిస్తే మాత్రం నిరాశతప్పదు.
ప్లస్ పాయింట్స్
చిరంజీవి
కథ
తమన్ నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్స్
రొటీన్ సెకండ్ హాఫ్
కొన్ని సాగాదీత సీన్లు
ఫైనల్ వర్డిక్ట్ : గాడ్ ఫాదర్ .. ఓకే బ్రదర్