ఆచార్య సినిమా భారీ అంచనాలతో విడుదలై.. డిజాస్టర్ అయిపోయింది. కాకపోతే ఆ సినిమాకి దాదాపు 140 కోట్ల బిజినెస్ జరిగింది. ఆ ఎఫెక్ట్... `గాడ్ ఫాదర్` బిజినెస్‌పై పడింది. ఆచార్య ఫ్లాప్‌తో.. `గాడ్ ఫాదర్` కొనడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. దానికి తోడు... అన్ని ఏరియాల్లోనూ తక్కువ రేట్లకే ఈ సినిమా అమ్మారు. మొత్తమ్మీద ప్రపంచ వ్యాప్తంగా రూ.92 కోట్ల బిజినెస్ చేయగలిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.100 కోట్ల మైలు రాయిని దాటేయాలి.
తొలిరోజు హిట్ టాక్ రావడంతో పాటు, దసరా సీజన్ గాడ్ ఫాదర్‌కి కలిసొచ్చింది. తొలి రోజు దాదాపుగా రూ.36 కోట్లు సాధించిందన్నది ట్రేడ్ వర్గాల రిపోర్ట్. నెట్ దాదాపు రూ.30 కోట్లు ఉండొచ్చు. అంటే ఇంకో 70 కోట్ల వరకూ రాబట్టాలి. బుధవారం విడుదలైన సినిమా ఇది. శుక్ర, శని, ఆదివారాలు బోనస్. పైగా ఈ సినిమాతో పాటుగా విడులైన `ది ఘోస్ట్` అట్టర్ ఫ్లాప్‌గా తేలిపోయింది. కాబట్టి `గాడ్ ఫాదర్`కి బాక్సాఫీసు దగ్గర ఎదురు లేకపోవొచ్చు. కాకపోతే.. ఈ 70 కోట్లు ఎన్నిరోజుల్లో సాధిస్తుందన్నదే ముఖ్యం.