Swathi Muthyam Review: స్వాతిముత్యం మూవీ రివ్యూ &రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, రావు రమేష్, ప్రగతి తదితరులు
దర్శకత్వం : లక్ష్మణ్ కె కృష్ణ
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
సంగీతం: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి


రేటింగ్: 3/5


గాడ్‌ఫాద‌ర్‌’, ‘ది ఘోస్ట్‌’ రెండూ పెద్ద సినిమాలే. చిరంజీవి నాగార్జున ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీసు వద్దకు వచ్చారు. అయితే వారి మధ్యలో ఒక చిన్న సినిమా కూడా వచ్చింది. అదే స్వాతిముత్యం . సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ నుంచి వచ్చిన సినిమాతో నిర్మాత బెల్లంకొండ సురేశ్ త‌న‌యుడు బెల్లంకొండ గ‌ణేశ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. తమ కథపై వున్న నమ్మకంతో దసరా బరిలో నిలవడానికి వచ్చిందీ సినిమా. మరి నిర్మాతలు పెట్టుకున్న నమ్మకం నిజమైయిందా ? అంతగా నమ్మకం కలిగించిన స్వాతిముత్యం కథ ఏమిటి ? 


కథ:


బాలమురళీకృష్ణ అలియాస్ బాలా (బెల్లంకొండ గ‌ణేశ్‌) చాలా బుద్ధివంతుడు. చాలా పద్దతిగా పెరిగి ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదిస్తాడు. ఎలక్ట్రసిటీ డిపార్ట్మెంట్ లో జూనియర్ ఇంజనీర్. చేతిలో గవర్నమెంట్ ఉద్యోగం వుండటంతో ఇక బాలాకి పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటాడు తండ్రి వెంకట్రావ్ (రావు రమేష్ ). స్కూల్ టీచర్ అయిన భాగ్యలక్ష్మి (వర్ష బొల్లమ్మ)ని పెళ్లి చూపుల్లో చూడ‌గానే ప్రేమలో పడతాడు. ఇద్దరి మనసులు కలుస్తాయి. మ‌రికొన్ని గంటల్లో పెళ్లి అన‌గా శైలజ (దివ్య శ్రీపాద)  ఓ తొమ్మిది నెలల బిడ్డను తీసుకొచ్చి నీ బాబే అంటూ బాల చేతిలో పెడుతుంది. బాల కూడా త‌న బిడ్డే అని ఒప్పుకుంటాడు.  దీంతో అందరూ నిర్ఘాంతపోయారు. ఇంత‌కీ ఆ శైలజ ఎవరు? ఆ పిల్లడు నిజంగా బాలాకు పుట్టిన బిడ్డేనా? స్వాతిముత్యంలాంటి బాలా పెళ్లికి ముందే బిడ్డని ఎలా క‌న్నాడు?  అనేది మిగతా కథ. 


సరోగసీ నేపధ్యంలో ఇది వరకూ చాలా సినిమాలు వచ్చాయి. ఆ మధ్య బాలీవుడ్ లో విదిదలైన మిమి కథ కూడా ఇదే లైన్ లో వుంటుంది. సరోగసి కోసం ఓ విదేశీ వనితా ఇండియా కి వచ్చి ఒక మహిళాతో అద్దె గర్భం మోయిస్తుంది. అయితే బిడ్డ అనారోగ్యంతో పుడతాడని తెలిసి ముఖం చాటేస్తుంది. దీంతో పుట్టిన పిల్లాడు ఎక్కడ పెరగాలనేది సమస్య. స్వాతిముత్యం కూడా అటు ఇటుగా అదే లైన్. సరోగసి బిడ్డ కావాలని ప్రయత్నించిన ఒక జంట.. ఎదో ప్రమాదం వలన చనిపోతే పుట్టిన బిడ్డ భాద్యత ఎవరిదీ .. అద్దె గర్భంమోసిన మహిళాదా ?.లేక వీర్యం దానం చేసిన వ్యక్తిదా ? ఆ బిడ్డ భవిష్యత్ ఎం కావాలి ? ఇదే పాయింట్ తో రాసుకున్న కథ స్వాతిముత్యం. అయితే ఈ పాయింట్ పాతదని దర్శకుడికి క్లారిటీ వుంది. అందుకే ఆ పాయింట్ ని మరీ ఒత్తి చెప్పకుండా కేవలం వినోదం పైనే ద్రుష్టి పెట్టాడు. 


బాల పెళ్లి కోసం చేసే ప్రయ‌త్నాల‌తో క‌థ మొద‌ల‌వుతుంది.అతని అమాయకత్వం, ఇంట్లో తల్లితండ్రుల నస, అత‌ని ఆఫీస్‌లో హంగామాతో ప్రథ‌మార్థంలో స‌ర‌దా స‌ర‌దాగా స‌న్నివేశాలు సాగిపోతాయి. బాలా, భాగ్యలక్ష్మి ప్రేమ క‌థ  కూడా ఫ్రెష్ గా వుటుంది.  విరామంలో  క‌థ‌లో చోటు చేసుకున్న మ‌లుపు సినిమాని మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చేస్తుంది.  ద్వితీయార్థం సన్నివేశాల్లో  మ‌రింత వేగం క‌నిపిస్తుంది.  చెప్పడానికి క‌థేమీ లేక‌పోయినా, క‌థానాయ‌కుడు పడే పాట్లు, అత‌న్ని కుటుంబ స‌భ్యులు చూసే తీరు మ‌రిన్ని న‌వ్వులు పంచుతుంది. దర్శకుడు చాలా క్లారిటీ గా వున్నాడు. ప్రేక్షకులని నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు. అందులో విజయం సాధించాడు 


నటీనటులు: 


బెల్లంకొండ గ‌ణేశ్‌స్క్రీన్ ప్రజన్స్ బావుంది  ఎక్కడా త‌డ‌బాటు లేకుండా న‌టించాడు. పాత్రకి త‌గ్గట్టుగా ఆయ‌న మొహంలో అమాయ‌క‌త్వం  పలికింది.  వర్ష బొల్లమ్మ  నటన  ఆక‌ట్టుకుంటుంది.  పెద్ద మ‌నిషిగా క‌నిపించే గోపరాజు రమణ పాత్ర సినిమాకు హైలెట్‌. ఆయ‌న పాత్ర చుట్టూ అల్లిన హాస్యం బాగా పండింది.

రావు ర‌మేష్ మేన‌రిజ‌మ్స్ ఆయ‌న పంచిన హాస్యం ఈ సినిమాకి మ‌రో ఆక‌ర్షణ‌. నరేష్‌, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హర్షవర్ధన్, ప్రగ‌తి, సురేఖ‌వాణి త‌దిత‌ర సీనియ‌ర్ న‌టులు తమ అనుభవాన్ని చూపించారు. 


టెక్నికల్ గా:


సాంకేతికంగా సినిమా డీసెంట్ గా వుంది. నేప‌థ్య సంగీతంతో ఆకట్టుకున్నారు మహతి స్వర సాగర్. సూర్య కెమెరా ప‌నిత‌నం రిచ్ గా వుంది.

ద‌ర్శకుడు ల‌క్ష్మణ్ కె.కృష్ణ  ఒక ఫన్ ఎంటర్ టైనర్ తీయాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో విజయం వరించింది. 


ప్లస్ పాయింట్స్ 


కథ, కథనం 
నటీనటులు , పండిన వినోదం 
నేపధ్య సంగీతం, 


మైనస్ పాయింట్స్


కొన్ని సాగదీత సీన్లు 
గుర్తుపెట్టుకునే పాటలు లేకపోవడం 


ఫైనల్ వర్దిక్ట్ : స్వాతిముత్యం నవ్విస్తాడు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS