Godfather: ప్రోమోతో మెగా మాస్ జాతర

మరిన్ని వార్తలు

చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌..ఈ ఇద్దరూ మెగాస్టార్లే. ఇద్దరూ కలిసి స్టెప్పేస్తే...దానికి ఓ అదిరిపోయే మాస్‌ బీట్‌ తోడైతే అభిమానులకు పండగే. అలాంటి ఓ పాటే ‘తార్‌మార్‌ తక్కర్‌మార్‌...’ అంటున్నారు మెగా అభిమానులు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రంలో సల్మాన్‌ నటించారు. తాజాగా తమన్‌ స్వరపరిచిన ‘తార్‌మార్‌..’ పాటకు సంబంధించిన ప్రోమోని చిత్రబృందం విడుదల చేసింది.

 

ఈ పాట ఇప్పుడు మాస్ ప్రభంజనం సృష్టిస్తుంది. మిలియన్ వ్యూస్ , లైక్స్ తో ఈ ప్రోమో యుట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో వుంది. పూర్తీ పాట 15న రానుంది. సత్యదేవ్‌, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్‌చరణ్‌, ఎన్వీ ప్రసాద్‌, ఆర్‌.బి.చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకుడు. ఈ చిత్రం అక్టోబరు 5న విడుదల కానుంది. లూసిఫర్ కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS