నాగార్జున - ప్రవీణ్ సత్తారు ‘ది ఘోస్ట్’ దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, అదే రోజు చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ కూడా విడుదల కానుండటంతో ఈ సినిమా వాయిదా పడుతుందని సోషల్‌మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాన్ని చిత్ర బృందం ఖండించింది. సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. అక్టోబరు 5న కచ్చితంగా ‘ది ఘోస్ట్’ వస్తాడని స్పష్టం చేసింది.
అంతేకాదు ‘ది ఘోస్ట్’లో 12 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని, అవన్నీ వేటికవే ప్రత్యేకమని తెలిపింది. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ వాటిని స్పెషల్‌గా డిజైన్ చేశారని, స్టంట్‌మాస్టర్ కూడా అంతే అద్భుతంగా తీశారని చెప్పింది. వెండితెరపై ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని తెలిపింది. మొత్తానికి టీం క్లారిటీ ‘ది ఘోస్ట్’ రాకపై ఎలాంటి అనుమానం లేదని స్పష్టమైయింది. అన్నట్టు నాగార్జున కెరీర్ లో ట్రెండ్ సెట్టర్ శివ కూడా అక్టోబరు 5నే విడుదలైయింది. ఇప్పుడు అదే డేట్ కి బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ గా వస్తున్నారు నాగ్.