సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూత..!

మరిన్ని వార్తలు

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు మధ్యాహ్నం.. చెన్నై లోని ఒక  ప్రైవేట్‌ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1939, ఏప్రిల్ 14 న విజయనగరంలో ఆయన జన్మించారు.

ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య సినిమాతో ఆయన నటుడిగా రంగప్రవేశం చేసారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 250 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన నాటకాలు, కథలు, నవలలు రాసేవారు.

గొల్లపూడి మారుతీరావు అకాల మృతికి iQlikMovies.com తరపున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS