అక్కినేని కోడలు సమంత సర్టిఫికెట్ పక్కా కరెక్ట్ అనాలేమో. ఎందుకంటే, మొన్న మామ నాగార్జున నటించిన 'మన్మధుడు 2' సినిమా మొదట సమంత చూసిందట. ఎందుకో సమంతకి అంతగా నచ్చలేదట. అసలు ఆ సినిమా ట్రైలరే సమంతకు నచ్చలేదని ప్రమోషన్స్‌లో పలు సార్లు నాగార్జునే స్వయంగా చెప్పారు. సమంత చెప్పినట్లుగానే, విడుదలయ్యాక సినిమా రివర్స్ రిజల్ట్ కొట్టింది.
కానీ, ఇప్పుడు సమంత భర్త నాగచైతన్య నటిస్తున్న 'వెంకీ మామ' మాత్రం సమంతకు బాగా నచ్చేసిందట. ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అని సమంత సర్టిఫికెట్ ఇచ్చేసిందట. సెన్సార్ రిపోర్ట్‌లా సమంత నుండి 'వెంకీమామ'కు హిట్ సర్టిఫికెట్ వచ్చేయడంతో, నాగచైతన్య పక్కా కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడట. తన సినిమాల విషయంలో సమంత ముక్కు సూటిగా వ్యవహరిస్తుందట. బాగుంటే బాగుందని, బాగోకపోతే, బాగోలేదని మొహమాటం లేకుండా చెప్పేస్తుందని నాగచైతన్య చెబుతున్నాడు. మంచి భార్య అంటే అలాగే ఉండాలిగా. ఇక ప్రమోషన్స్ జోరు చూస్తుంటే, ఈ సినిమా విజయంపై చిత్ర యూనిట్ కూడా నమ్మకంగా ఉన్నట్లే కనిపిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు.