'వరుడు కావలెను' తర్వాత మంచి టాక్ తెచ్చుకున్న సినిమా మరోటి రాలేదు. రాజా విక్రమార్క, పుష్పక విమానం, అంతకు ముందు వచ్చిన పెద్దన్న, మంచి రోజులు వచ్చాయి.. ఇలా వరసరుగా నిరాశ పరిచాయి. గత వారం థియేటర్ సినిమా లేదు. ఓటీటీలో వచ్చిన అద్భుతం ఓకే అనిపించింది. ఈ వారం కూడా పెద్ద సినిమా హంగామా లేదు. దృశ్యం 2 ఓటీటీ కి వెళ్ళిపోతుంది. బాక్సాఫీసు ఖాళీగానే వుంది. రాజ్ తరుణ్ అనుభవవించు రాజా ఒక్క సినిమా మాత్రమే మీడియం సినిమాగా కనిపిస్తుంది.
రాజ్ యుత్ ఫుల్ హీరో. వరుసగా హిట్లు ఇచ్చాడు. అయితే కొన్నాళ్ళుగా రాజ్ కి హిట్ లేదు. కనీసం యావరేజ్ కూడా లేదు. హిట్ కోసం చేసిన ప్రయోగాలు కూడా ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ తనకు అచ్చివచ్చిన పల్లెటూరి నేపధ్యంలో అనుభవించు రాజా చేశాడు. ట్రైలర్ ప్రామెసింగా వుంది. థియేటర్ లో పోటిలేదు. రాజ్ తరుణ్ కి ఇది మంచి అవకాశం. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన థియేటర్ ప్రేక్షకులు ఇటు వైపు చూస్తారు. మరి చూడాలి రాజ్ తరుణ్ ఈ అవకాశం ఎలా వినియోగించుకుంటాడో.