సిటీమార్ తో కాస్తో కూస్తో ఓపెనింగ్స్ దక్కించుకున్నాడు గోపీచంద్. సెకండ్ వేవ్ లో.. కాస్త ఉపశమనం కలిగించిన సినిమా ఇది. అయితే.. ఆ జోరు చివరి వరకూ కొనసాగలేదు. దాంతో సిటీమార్ అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేదు. అయితే సిటీమార్‌కి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కదా అని మూలన పడి ఉన్న `ఆరడుగుల బుల్లెట్`ని బయటకు తీశారు నిర్మాతలు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం విడుదల కావాల్సిన సినిమా ఇది. `సిటీమార్` బూస్టప్ తో `ఆరడుగుల బుల్లెట్`ని రిలీజ్ చేశారు.
గత వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి వరకూ రూ.1.15 కోట్లు మాత్రమే రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి దాదాపు 3 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే. మరో 2 కోట్లు రావాల్సివుంది. అదంతా.. హుష్ కాకి అయినట్టే. ఈ సినిమాని ఓటీటీ పరంగా గానీ, శాటిలైట్ పరంగా గానీ మంచి రేట్లు రాలేదు. దానికి కారణం.. ఆలస్యంగా విడుదల అవ్వడమే. అయితే ఇది వరకే హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మేయడం కాస్త కలిసి వచ్చింది. ఎటు చూసినా... నిర్మాతలకు ఈ సినిమా భారీ నష్టాల్ని మిగిల్చినట్టే. అంతేకాదు.. సిటీమార్ ఊపు చూసి కొన్న బయ్యర్లకూ... నష్టాలు తప్పలేదు. మొత్తానికి.. . గోపీచంద్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరిపోయినట్టే.