యంగ్ హీరో గోపీచంద్ ఈ మధ్యన కొంచం కెరీర్లో స్లో అయ్యాడనే చెప్పొచు. అతని రేంజ్ కి తగ్గ విజయాలు లేక అతని అభిమానులు సైతం డీలా పడ్డారు.
అయితే ఇప్పుడే రిలీజ్ అయిన గౌతం నందా ఫస్ట్ లుక్ మాత్రం ఫస్ట్ లుక్ లోనే అందరిని ఆకట్టుకుంది. గోపీచంద్ కూడా స్టైలిష్ లుక్ తో అందరికి షాక్ ఇచ్చాడు. డైరెక్టర్ సంపత్ నంది కూడా ఈ సినిమా కోసం బాగా వర్క్ చేసినట్టు ఈ లుక్ చూస్తుంటే తెలుస్తుంది.
దాదాపు షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఇక హీరోయిన్స్ కాథరిన్, హన్సిక అందాలు ఈ సినిమాకి ప్లస్ అని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.
చూద్దాం.. గోపీచంద్ ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదు..