గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. హన్సిక, కేథరిన్ కథానాయికలు. జె. భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలు. ఈ చిత్రానికి గౌతమ్ నందా అనే టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. పవన్ కల్యాణ్ సినిమా అత్తారింటికి దారేదిలో పవన్ పేరు గౌతమ్ నందా. ఆ పేరుని సంపత్‌నంది టైటిల్ గా మార్చుకొన్నాడన్నమాట. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ శనివారం విడుదల చేయనుంది. ఈ సందర్భంగా టైటిల్ ఖరారు చేయనున్నాయి. మరోవైపు గోపీచంద్ సినిమా ఆక్సిజన్ కూడా చిత్రీకరణ పూర్తి చేసుకొంది. నెల రోజుల వ్యవధిలో ఈ రెండు సినిమాలూ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అర్థాంతరంగా ఆగిపోయింది. మరి దానిసంగతేంటో..??