వీరసింహారెడ్డిలోపొలిటికల్ డైలాగులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా రాష్ట్ర, అభివృద్ధి, పేర్లు మార్చడం పై చెప్పిన డైలాగులు ఏపీ రాజకీయాలు గురించే అనే చర్చ జరుగుతుంది. తాజాగా మీడియాతో ముచ్చటించిన గోపి.. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
''కథ నుండి పుట్టిన డైలాగులవి. ఏది వాంటెడ్ గా పెట్టలేదు. కథలో అంత సహజంగా వున్నాయి కాబట్టే ప్రేక్షకులందరూ ఇంత గొప్పగా ఆదరిస్తున్నారు. బోర్డ్ మీద పేరు మార్చే డైలాగు గమనిస్తే.. ఒక మంచి పని కోసం పని చేసే వ్యక్తి నుండి మరొకడు తన బలం వాడి ఆ కంపెనీ తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో హీరో చెప్పే డైలాగు అది. అలాగే ఒక ఫ్యాక్టరీని తొలిగించాలని ప్రయత్నం జరుగుతున్నపుడు.. అభివృద్ధి అనే డైలాగ్ హీరో వాడుతారు. అంతే తప్పితే ఇందులో మేము కావాలని పెట్టింది ఏదీ లేదు'' అని చెప్పుకొచ్చారు గోపిచంద్ మలినేని.