గోపీచంద్ 'పంతం' ఫస్ట్ డే రాకింగ్ కలెక్షన్స్

By iQlikMovies - July 06, 2018 - 16:36 PM IST

మరిన్ని వార్తలు

గోపీచంద్ 25వ చిత్రం పంతం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ చిత్రానికి మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ రావడంతో అందరూ ఈ సినిమా వసూళ్ళ పైన దృష్టిసారించారు.

ఇక మొదటి రోజు వసూళ్ళు ఒకసారి పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి సుమారు రూ 3 కోట్ల (షేర్), రూ 5 కోట్ల (గ్రాస్) వసూలు చేసింది. ఈ కలెక్షన్స్ బట్టి చూస్తే ఈ సినిమాకి వచ్చిన మిక్స్డ్ టాక్ కారణంగానే ఇలా కలెక్షన్స్ యావరేజ్ గా వచ్చినట్టు స్పష్టమవుతున్నది.

 

అయితే ఈరోజు నుండి ఆదివారం వరకు కూడా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉండడంతో మరి ఈ వీకెండ్ కల్లా పంతం సినిమా సేఫ్ జోన్ లోకి వెళుతుందా లేదా అనేది చూడాలి. అయితే గోపీచంద్ కూడా ఈ సినిమా పైన చాలానే అంచనాలు పెట్టుకున్నాడు, పైగా ఇది 25వ చిత్రం కావడంతో ఈ సినిమా విజయం ఆయనకి సవాలుగా మారింది.

ఇవి గోపీచంద్ పంతం కలెక్షన్స్ వివరాలు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS