రవితేజ హీరోగా 'రాబిన్‌హుడ్' అనే సినిమా తెరకెక్కనుందని అప్పట్లో టాక్ వినవచ్చింది. చక్రి అనే కొత్త దర్శకుడు రవితేజకు తొలుత ఈ కథ చెప్పాడు. ఈ సినిమా కోసమే రవితేజ అప్పట్లో సిక్స్ ప్యాక్ ఫిజిక్ ట్రై చేశాడు. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. తాజాగా రవితేజ ఈ మధ్య వరుసగా రెండు సినిమాల్ని స్టార్ట్ చేసేశాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు', అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ఇంకో వైపున 'రాబిన్ హుడ్' సబ్జెక్ట్ ఇప్పుడు గోపీచంద్ వద్దకు వెళ్ళిందట. కథ నచ్చడంతో వెంటనే గోపీచంద్ ఓకే చెప్పేశాడని తెలియవస్తోంది. 'ఆక్సిజన్', 'గౌతమ్ నందా' చిత్రాల తర్వాత గోపీచంద్ చేయబోయే సినిమా ఇదేనని సమాచారమ్. ఈ సినిమా కోసం గోపీచంద్ సిక్స్ ప్యాక్ ఫిజిక్ ట్రై చేస్తాడని తెలియవస్తోంది. అతి త్వరలోనే 'రాబిన్ హుడ్' సినిమాని పట్టాలెక్కించనున్నారట. ఓ హీరో నుంచి కొన్ని కారణాలతో దూరమైన సినిమా ఇంకో హీరో దగ్గరకు వెళ్ళి ఘనవిజయాలు సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా హిట్లు కొట్టి లాభపడ్డ హీరోల్లో రవితేజ ముందుంటాడు. అలాంటిది రవితేజ నుంచి దూరమైన సినిమా 'రాబిన్ హుడ్' గోపీచంద్‌కి ఇంకెంత లాభం చేకూర్చుతుందో చూడాలిక.