బాహుబలి సినిమా అనే రేంజ్ ఎప్పుడో దాటిపోయి బాహుబలి కామిక్ బుక్స్, రైజ్ అఫ్ శివగామి పేరిట బుక్ అలాగేఇప్పుడు ఏకంగా బాహుబలి మొబైల్ గేమ్ రాబోతుంది.
నిన్ననే ప్రముఖ గేమ్ డిజైనర్ మార్క్ స్కగ్గ్స్ డైరెక్టర్ రాజమౌళితో ప్రత్యేకంగా భేటి అయ్యాడు. బాహుబలి మొబైల్ గేమ్ ఎలా ఉండాలి అనే సూచనలను రాజమౌళి నుండి తీసుకున్నాడు. ఇంతకముందు మార్క్ లార్డ్ అఫ్ ది రింగ్స్, ఫార్మ్ విల్లె గేమ్స్ ని రూపొందించాడు.
చూద్దాం.. బాహుబలి సినిమానే కాదు బాహుబలి మొబైల్ గేమ్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.