గోపీచంద్‌ పాత్రలో నువ్వా.. నేనా అంటూ పోటీ..!

మరిన్ని వార్తలు

'బ్యాడ్మింటన్‌' నేపథ్యంలో ఇటు తెలుగులోనూ అటు హిందీలోనూ ఒకేసారి రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. బ్యాండ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు బయోపిక్‌ని నటుడు సోనూసూద్‌ నిర్మిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో ఆయన కూడా నటిస్తున్నట్లు తెలిపారు. ఎంతో ఇష్టపడి, కష్టపడి రీసెర్చ్‌ చేసి చేస్తున్న ఈ సినిమాలో సింధు కోచ్‌ గోపీచంద్‌ పాత్ర తననెంతో ఇన్‌స్పైర్‌ చేసిందనీ, అందుకే ఆ పాత్రలో తానే నటించాలని నిర్ణయం తీసుకున్నానని తాజాగాసోనూసూద్‌ తెలిపారు.

 

అయితే టైటిల్‌ రోల్‌ అయిన సింధు పాత్రలో కనిపించేదెవరో ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే, తెలుగులో బ్యాండ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌ బయోపిక్‌ తెరకెక్కుతోన్న సంగతి కూడా తెలిసిందే. సుధీర్‌బాబు హీరోగా ఈ బయోపిక్‌ రూపొందుతోంది. గోపీచంద్‌ జీవితంలోని ఎత్తు పల్లాల్ని ఆయన అందుకున్న లక్ష్యాల్ని ఈ సినిమాలో హృద్యంగా చూపించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో సింధు పాత్ర కూడా ఉండనుంది. ఒకప్పుడు గోపీచంద్‌కి అత్యంత ప్రియమైన శిష్యుడు సుధీర్‌బాబు.

 

సినిమాల్లోకి వచ్చాక బ్యాడ్మింటన్‌ని పక్కన పెట్టేశాడు. మళ్లీ ఈ సినిమా కోసం రాకెట్‌ పట్టుకుని శిక్షణ తీసుకుంటున్నాడు. ఇటీవల కోర్ట్‌లో సుధీర్‌బాబు బ్యాడ్మింటన్‌ ఆడుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఇక్కడ సుధీర్‌బాబు, అక్కడ సోనూసూద్‌ గోపీచంద్‌ పాత్రలో ఒదిగిపోయేందుకు కసరత్తులు చేస్తున్నారన్నమాట. అయితే అక్కడా, ఇక్కడా సింధు పాత్రలో ఎవరు కనిపించబోతున్నారో మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS