దుల్కర్‌ సల్మాన్‌తో జాన్వీకపూర్‌.?

మరిన్ని వార్తలు

ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌తో అతిలోక సుందరి కుమార్తై జాన్వీ కపూర్‌ జోడీ కట్టబోతోందట. అయితే ఇది మలయాళ సినిమా కోసం కాదు, బాలీవుడ్‌ సినిమా కోసమే. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో జాన్వీ కపూర్‌ లీడ్‌ రోల్‌లో ఓ బయోపిక్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తొలి మహిళా ఐఏఎఫ్‌ పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితాధారంగా రూపొందుతోన్న ఈ బయోపిక్‌లో జాన్వీ కపూర్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది. రెండో సినిమాకే ఇంత పెద్ద బాధ్యత తనపై పడినందుకు ఆ అవకాశాన్ని మరింత బాధ్యతగా సద్వినియోగం చేసుకుంటానని జాన్వీ గతంలోనే చెప్పింది.

 

ఈ సినిమాలో తన పాత్ర తీరు తెన్నులపై ఆరా తీసేందుకు జాన్వీకపూర్‌, సక్సేనాని కలిసింది కూడా. సక్సేనాలా తనని తాను మార్చుకోవడానికి జాన్వీ ప్రయత్నిస్తోంది. కార్గిల్‌ వార్‌లో గాయపడిన వారిని సక్సేనా తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లింది. ఒంటరిగా ఆమె చేసిన ఆ సాహసానికి ప్రశంసలు అందుకుంది సక్సేనా.

 

ఇక ఈ సినిమాలో జాన్వీకి జోడీగా దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నాడట. లేడీ ఓరియెంటెడ్‌ మూవీ అయిన ఈ సినిమాలో దుల్కర్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడనీ సమాచారమ్‌. ఆల్రెడీ హిందీలో రెండు సినిమాల్లో నటించిన దుల్కర్‌కి ఈ సినిమాతో మంచి పేరు దక్కుతుందని ఆశిద్దాం. మరోవైపు జాన్వీ 'తఖ్త్‌' అనే పీరియాడికల్‌ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్‌పైకి వెళ్లనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS