బుల్లితెర యాంకర్ రేష్మీ చుట్టూ చక్కర్లు కొట్టే గాసిప్స్ కొంచెం ఎక్కువే. బుల్లితెరపై హాటెస్ట్ యాంకర్‌గా మొదట్నుంచీ ఆమెకి కేక పుట్టించే ఫాలోయింగ్ ఉంది. అలాగే సినిమాల్లో కూడా ఆమె గ్లామర్‌తో కిర్రాక్ పెట్టిస్తున్న సంగతి కూడా తెలిసిందే. హారర్ కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ హారర్‌ని తన అందచందాలతో డామినేట్ చేసేస్తూ ఉంటుంది. మరో పక్క బుల్లితెరపై తనకి గుర్తింపు తెచ్చిన ప్రోగ్రామ్ 'జబర్దస్త్'. ఈ నవ్వుల ప్రోగ్రాంకి రేష్మీ తన హాట్ హాట్ గ్లామర్‌తో మరింత హీటెక్కిస్తూ ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో పొట్టి పొట్టి డ్రస్సులేసుకుని కుర్రకారు నుండి పండు ముసలి దాకా రేష్మీ తన అందాలతో కట్టి పడేస్తుంది. ఇదే ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ అయిన సుధీర్‌కి రేష్మీకి మధ్య ఏదో ఉందంటూ హాట్ హాట్ గాసిప్స్ ఎప్పుడూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే రేష్మీ వీటిని ఎప్పటికప్పుడే కొట్టి పారేస్తూ ఉంటుంది. సెలబ్రిటీస్‌పై ఇలాంటి కామెంట్స్ చాలా సహజం. లైట్ తీస్కోండి అంటుంది ముద్దుగుమ్మ రేష్మీ. ఇకపోతే సుధీర్ ఈ విషయంలో ఎప్పుడూ స్పందించలేదు. ఈ సారి ఈ విషయమై కొంచెం ఘాటుగా స్పందించాడు. మా మధ్య ఏ రిలేషన్ లేదు. జస్ట్ యాంకర్ అండ్ పార్టిసిపెంట్ రిలేషన్ తప్ప. తెరపై మేమేం చేసినా ఆడియన్స్‌ని నవ్వించే ప్రయత్నమే అంటున్నాడు. అంతేకాదు తనపై వచ్చే గాసిప్స్ కారణంగా తనకి పెళ్లి చేసుకోవడానికి పిల్లనివ్వడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదంటూ నవ్వేస్తున్నాడు ఈ బుల్లితెర నవ్వుల రారాజు. నిజంగానే సుధీర్ ఈ మాటలు అన్నాడా? లేక మళ్లీ నవ్వించడానికే జోక్ చేశాడా? ఏమో సుధీర్‌కే తెలియాలి.