ఫౌజీ లో విలన్ గా టాలీవుడ్ స్టార్ హీరో?

మరిన్ని వార్తలు

'తొలివలపు' సినిమాతో హీరోగా టాలివుడ్ లో అడుగుపెట్టిన గోపీచంద్ తరవాత అనుకోకుండా విలన్ గా మారాడు. హీరోగా పెద్దగా గుర్తింపు రాకపోయినా విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తేజ దర్శకుడిగా తెరకెక్కించిన జయం సినిమాలో విలన్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించాడు. తరువాత మహేష్ బాబు, తేజ కాంబో 'నిజం'. ప్రభాస్ హీరో గా నటించిన 'వర్షం' సినిమాల్లో విలన్ గా చాలా ఫేమస్ అయ్యాడు. విలన్ పాత్రలతో వచ్చిన గుర్తింపు తో మళ్ళీ హీరోగా 'యజ్ఞం' మూవీ చేసాడు. ఈ చిత్రం గోపిని హీరో గా నిలబెట్టింది. ఇక అక్కడ నుంచి హీరోగా కొనసాగుతున్నాడు. 


ఈ మధ్య గోపి చంద్ కి సరైన హిట్ రావటం లేదు. తాజాగా శ్రీను వైట్లతో 'విశ్వం' మూవీ చేయగా అది కూడా ప్లాఫ్ అయింది. వర్షం చిత్రం తరువాత ప్రభాస్, గోపి చంద్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా అవతారం ఎత్తాడు. మళ్ళీ ప్రభాస్, గోపి చంద్ కాంబో కోసం ఎప్పటినుంచో ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో వీరిద్దరూ సేమ్ వర్షం లానే ప్రభాస్ హీరోగా, గోపి విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం. ప్రభాస్‌ ప్రస్తుతం 'ది రాజా సాబ్' సినిమాతో పాటు హను రాఘవపూడితో 'ఫౌజీ'  చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఫౌజీలో గోపీచంద్‌ విలన్‌గా నటించనున్నట్లు టాక్‌. 


హీరోగా ఒడిదుడుకుల్లో ఉన్న గోపికి ప్రభాస్ ద్వారా బిగ్గెస్ట్ హిట్ అందుకుని పాన్ ఇండియా విలన్ గా సెటిల్ అవుతాడేమో చూడాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ మధ్య ప్రభాస్ సినిమాలు వరల్డ్ వైడ్ గా సత్తా చాటుతున్నాయి. ఫౌజీ లో గోపి విలన్ గా నటిస్తే ఆ క్రేజే వేరు . తెలుగులో ప్రస్తుతం విలన్స్ గా ఉన్న బాలీవుడ్ హీరోలకి గోపి మంచి పోటీ ఇస్తాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS