బాలీవుడ్ బ్యూటీ సోనమ్‌కపూర్ పెళ్ళి పీటలెక్కనుందట. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద ఆహుజాతో గత కొంతకాలంగా ప్రేమాయణంలో మునిగి తేలుతోంది సోనమ్ కపూర్. వీరిద్దరి ప్రేమని ఇరువురు కుటుంబ సభ్యులు అంగీకరించారని, త్వరలో వీరిద్దరి పెళ్లీ జరగనుందని సమాచారమ్. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరుగుతుందట. సోనమ్‌కపూర్ కంటే ఎంతోమంది సీనియర్లు, తమకింకా పెళ్ళి వయసు రాలేదని చెబుతుండడం చూశాం. మన టాలీవుడ్‌లోనూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఉన్నారు. బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ ఎందుకు తొందరపడుతుందో ఏమోగానీ, పెళ్ళయ్యాక కూడా సోనమ్ కపూర్ సినిమాల్లో నటిస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. అయితే ఇంతవరకు సోనమ్ కపూర్ తన పెళ్ళి వార్తల్ని ధృవీకరించలేదు. ఆమె తల్లి మాత్రం తన కుమార్తెకు త్వరలోనే పెళ్ళి చేసేస్తామని చెప్పడంతో ఈ విషయమంతా బయటకు వచ్చింది. సోనమ్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు. సంజయ్‌దత్ బయోపిక్‌లో, రణ్‌బీర్ కపూర్ సరసన నటిస్తోంది. అలాగే అక్షయ్‌కపూర్‌తో ఓ సినిమాలోనూ, ఇంంకో సినిమాలోనూ నటిస్తూ బిజీగా ఉంది సోనమ్ కపూర్. ఐశ్వర్యారాయ్ పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో నటిస్తోంది. కరీనాకపూర్ కూడా అంతే. పెళ్ళయ్యాక మరింత హాట్‌గా సినిమాల్లో నటించేయడం బాలీవుడ్ హీరోయిన్లకే చెల్లింది. సోనమ్ కపూర్ కూడా అంతేనేమో.