ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ, హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా, ఎప్పుడూ బిజీగా ఉండే మాస్ రాజా రవితేజ దాదాపు ఏడాదిన్నర సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. అయితే గతేడాదే మాస్ రాజా పిచ్చ ఊపుతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అదే 'రాజా ది గ్రేట్' సినిమాతో. రీ ఎంట్రీ ఇస్తూనే, ప్రయోగాత్మక చిత్రం చేశాడు. అంధుడిగా నటించాడు. అయితే అంధుడి పాత్రైనా లాజిక్స్ ఏమీ పాఠించకుండా, రవితేజ జోష్‌కి తగ్గట్లుగానే డైరెక్టర్ ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేయడంతో 'రాజా ది గ్రేట్'తో ఓకే అనిపించాడు రవితేజ.
కానీ ఆ తర్వాత వచ్చిన 'టచ్ చేసి చూడు' చిత్ర మాత్రం బెడిసి కొట్టింది. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణతో 'నేల టికెట్' సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఇదంతా బాగానే ఉంది. కానీ రవితేజపై కొత్తగా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయిప్పుడు. గతంలో రవితేజ గ్యాప్ తీసుకోవడానికి కారణం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడమేననీ, అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే అదంతా ఉత్తదేననీ, ఆయన ఒళ్లు తగ్గించే ప్రయత్నంలో వర్కవుట్స్ నిమిత్తం విదేశాలకు వెళ్లారనీ, పనిలో పనిగా ఫ్యామిలీతో ఫుల్‌గా కొన్నాళ్లు ఎంజాయ్ చేసి వచ్చారనీ ఆ తర్వాత రవితేజే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అయితే అలాంటి రూమరే ఇప్పుడు మళ్లీ ప్రచారంలో ఉంది.
రవితేజ ఆరోగ్య పరిస్థితి బాగోలేదనీ, అందుకే ఆయన తాను ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నారనీ గాసిప్స్ వినవస్తున్నాయి. తాజాగా ఈ గాసిప్స్ పట్ల డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ స్పందించారు. షూటింగ్‌కీ ఏ రకమైన బ్రేక్ రాలేదనీ, ప్రస్తుతం శరవేగంగా 'నేల టికెట్' సినిమా షూటింగ్ జరుగుతోందనీ, ఈ ఏడాదిలోనే ఆ సినిమాని విడుదల చేసే యోచనలో ఉన్నామనీ ఆయన తెలిపారు. అయినా ఈ మధ్య హీరోల హెల్త్ విషయంలో అనవసరంగా పుట్టుకొస్తున్న ఈ రూమర్స్ ఎక్కువైపోయాయ్.
రవితేజ విషయంలోనే కాదు, తమిళ స్టార్ విశాల్ విషయంలో కూడా ఇలాంటి రూమరే స్ప్రెడ్ అవుతోంది. అయితే మొదట్లోనే స్పందించి ఈ రూమర్‌ని గట్టిగా ఖండించాడు హీరో విశాల్.!