నటి శ్రియా శరణ్ పెళ్ళి ముహూర్తానికి సంబంధించిన వివరాలు బయటకి వచ్చాయి. అందుతున్న సమాచారం ప్రకారం, మార్చ్ 17, 18 & 19 తేదీలలో ఉదయ్ పూర్ లో ఈ వివాహం జరగనుందట.
ఇంతకీ ఆమె వివాహం చేసుకుంటున్నది రష్యాకి చెందిన ఆండ్రీ కోస్చీవ్ అనే బిజినెస్ & స్పోర్ట్స్ మెన్ ని. ఈ వివరాలు ఈరోజే మీడియాకి లీక్ అవ్వడం జరిగింది. అయితే ఈ వార్తని ఆమె ఇంకా దృవీకరించవలసి ఉంది.
గత నెలలో ఇదే వార్తకి సంబంధించి మీడియా వారు ప్రశ్నించగా శ్రియా శరణ్ వాటిని ఖండించింది. అలాగే వారి కుటుంబసభ్యులు కూడా ఆమె తరహాలోనే వాటిని కొట్టిపారేశారు.
మొత్తానికి నటి శ్రియా శరణ్ వచ్చే నెలలో పెళ్ళి కూతురు అవుతున్నది.