పిట్ట కుంచెం కూత ఘనం అన్నట్టుగా గౌతమ్ వడ్డి అనే ఈ కుర్రాడు ఇప్పుడు అంతర్జాలంలో ఒక హాట్ టాపిక్ అయి కూర్చున్నాడు. దానికి కారణాలు ఏంటో ఈ క్రింద తెలుసుకుందాం..
గౌతమ్ వడ్డి- ఈ 16 ఏళ్ళ కుర్రాడు ఇంత పిన్న వయసులోనే తబలా వాయిద్యకారుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. తన తండ్రి అయిన డా. సుందర్ వడ్డి గారి మార్గదర్శకంలో గౌతమ్ తన భవిష్యత్తుని సంగీతంలో వెతుకుంటున్నాడు.
ఇక తాజాగా గౌతమ్ అలనాటి పాత హిందీ గీతాన్ని తనదైన శైలిలో కంపోజ్ చేసి ఒక వీడియో చేశాడు. ఆ వీడియో పేరు- O MERE DIL KE CHAIN. ఇక ఈ పాట 1972లో హిందీ చిత్రసీమలో విడుదలైన మేరే జీవన్ సాతి చిత్రంలోనిది. ఈ పాటని సంగీత దిగ్గజం- RD బర్మన్, గొప్ప నేపధ్యగాయకుడు కిషోర్ కుమార్ అలాగే సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాకి అంకితం ఇచ్చాడు.
ఈ వీడియో సాంగ్ ని సముద్రపు ఒడ్డులో చక్కటి విజువల్స్ తో తీయగా ఈ సాంగ్ లో గౌతమ్ తో పాటుగా ఆయన తండ్రి సుందర్ కూడా కనిపిస్తారు. ఇక గౌతమ్ గత 9 సంవత్సరాలు అంటే 2009 నుండి తబలా లో శిక్షణ పొందుతున్నాడు, ఈయన ఇప్పటివరకు ఈ క్రింద గురువుల వద్ద తబలా శిక్షణ పొందాడు-
- పండిట్ మురళి (హైదరాబాద్)
- పండిట్ రోహిత్ కులకర్ణి (పూణే)
- ఉస్తాద్ అమాన్ అలీ (ఢిల్లీ)
గౌతమ్ ప్రతిభకి ఇప్పటికే అనేక అవార్డులని వరించాయి, అందులో కొన్ని ప్రముఖమైనవి- బాలోత్సవ్ అవార్డు, ప్రభావతి సర్టిఫికెషన్ & చిన్మయి నాద బిందు సర్టిఫికేషన్. ఇక ఇప్పటికి ఇంతటి చిన్న వయసులో సుమారుగా 8కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ఎంతోమంది హృదయాలలో స్థానాన్ని సంపాదించుకున్నాడు.
త్వరలోనే ఈ కుర్రాడు తెలుగు సంగీత కుటుంబంలో ఒక ముఖ్య సభ్యుడు అవ్వాలని కోరుకుందాం..