హీరోయిన్లు తమని తాము ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ అనూ ఇమ్మాన్యుయేల్ అలా కాదు. చేసినవి తక్కువ సినిమాలే అయినా కానీ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే 'అజ్ఞాతవాసి' ఫెయిల్యూర్‌తో ఎలా వచ్చిందో ఆ క్రేజ్ అలాగే పోయింది. క్రేజ్ సంగతి పక్కన పెడితే, అమ్మడి ఆటిట్యూడ్ గురించి ఇండస్ట్రీలో మరోలా టాక్ నడుస్తోంది.
ఇందుకు కారణం ఈ బ్యూటీ లేటెస్టుగా నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా గుడ్ టాక్‌తో విజయం దిశగా పరుగులు పెడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది. ఆ సక్సెస్ మీట్‌కి పవన్ కళ్యాణ్ ఛీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ సక్సెస్ మీట్‌కి హీరోయిన్ అయిన అనూ ఇమ్మాన్యుయేల్ హాజరు కాకపోవడం పట్ల అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరు స్టార్ హీరోల అప్పియరెన్స్ ఉన్న స్టేజ్ మీద ఆ సినిమా హీరోయిన్ అయిన అనూ ఇమ్మాన్యుయేల్ లేకపోవడం ఎంతో వెలితిగా అనిపించింది. అంతేకాదు, ఇలాంటి అవకాశాలు హీరోయిన్స్‌కి, అందులోనూ అనూ ఇమ్మాన్యుయేల్ వంటి హీరోయిన్స్‌కి మళ్లీ మళ్లీ రావు. అలాంటి గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకుందీ బ్యూటీ అంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే తాను సక్సెస్ మీట్‌కి రానందుకు సమ్‌థింగ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణమని సింపుల్ రీజన్ ఒకటి చెప్పి తప్పించుకుంది అనూ ఇమ్మాన్యుయేల్.