బాలయ్య వందో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' రిలీజ్‌కు రెడీ అయ్యింది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఈ సినిమా స్పెషల్ షోని వేయనున్నారట. ఈ సినిమాకి కేసీఆర్‌ని ఆహ్వానించడానికి స్వయంగా బాలకృష్ణ తెలంగాణా అసెంబ్లీకి వెళ్లనున్నారట. కేసీఆర్‌తో పాటు వీలైనంత మంది ప్రజా ప్రతినిధులను ఈ స్పెషల్‌షోకి ఆహ్వానించనున్నారట బాలయ్య. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి కేసీఆర్ హాజరయ్యారు. ఇంత గొప్ప చరిత్రను తెరకెక్కించాలన్న ఆలోచన వచ్చినందుకు క్రిష్‌ని, బాలయ్యను కేసీఆర్ అభినందించారు కూడా. అంతేకాదు ఈ సినిమాని నాకు చూడాలని ఉందనే తన మనసులోని మాటను అప్పుడే చెప్పారు కేసీఆర్. అందుకే బాలయ్య స్వయంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని కేసీఆర్ కోసం స్పెషల్ షో ప్లాన్ చేశారట. ఆంధ్ర, తెలంగాణా కాకుండా ఎక్కడున్నా తెలుగు వారంతా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. తెలుగు జాతి గొప్పతనాన్ని చాటి చెప్పే కథ ఇది. తెలుగు వారి అచ్చతెలుగు పండగ సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడం అనేది గొప్ప విషయం. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ సినిమాలో నటించిన తారాగణం అంతా నిజంగా అదృష్టం చేసుకున్నట్లే. ముద్దుగుమ్మ శ్రియ, బాలీవుడ్ బ్యూటీ హేమామాలినిలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.