అదిరిపోయేలా పుష్పరాజ్ పార్టీ

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్, సుకుమార్ కాంబో మూవీ 'పుష్ప 2'జోరు ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. మూవీ రిలీజైన వారం రోజుల లోపే 1000 కోట్ల మార్క్‌కి చేరుకుంది. ఈ ఘ‌న‌త దక్కించుకున్న ఇండియన్ సినిమాగా పుష్ప 2 నిలిచింది. అందుకే టీమ్ మొత్తం పార్టీ మూడ్ లో ఉంది. 'పార్టీ ఉంది పుష్ప... పార్టీ ఉంది' అని షెకావత్ చెప్పిన డైలాగ్ రిపీట్ చేస్తున్నారు. ఈ బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ ని సెల‌బ్రేట్ చేసుకోనున్నాడు బన్నీ. సినిమా రిలీజ్ కి ముందే కొన్ని ఈవెంట్స్ నిర్వహించారు టీమ్. ఇప్పడు కూడా సక్సెస్ మీట్ ని నిర్వహించే పనిలో పడ్డారట. ఫైనల్ గా పుష్ప 2 రెండువేల కోట్లు సాధించే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నార్త్ లో రోజు రోజుకి వసూళ్లు పెరుగుతున్నాయి. ఒక తెలుగు సినిమాకి నార్త్ లో ఇంత ఆదరణ దొరకటం విశేషం.

అందుకే బ‌న్నీ గ్రాటిట్యూడ్ కోసం ముంబాయిలో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడట. అక్క‌డి మీడియాతో బ‌న్నీ ఇంటరాక్ట్ అయ్యి, వారి ప్రేమకి కృతజ్ఞతలు చెప్తాడని సమాచారం. నెక్స్ట్ బెంగ‌ళూరు, చెన్నై, కేర‌ళ‌లో కూడా సక్సెస్ మీట్ లు జ‌ర‌గ‌నున్నాయి. ప్రమోషన్స్ కూడా ఇలాగే నిర్వహించారు. సేమ్ అదే ఫాలో అవుతూ చివరికి హైద‌రాబాద్ లో ఓ గ్రాండ్ పార్టీ ఆరెంజ్ చేయనున్నాడట. ఇదే లాస్ట్ ఈవెంట్ అవుతుంది. ఏదైనా కానీ బన్నీ ఆలోచనకి అంతా ఫిదా అవుతున్నారు. కారణం రిలీజ్ కి ముందు  ప్రమోషన్స్ కోసం ఇంటరాక్ట్ అవుతారు. కానీ విజయం సాధించాక కూడా అన్ని చోట్ల గ్రాటిట్యూడ్ మీట్ పెట్టడం అభినందించాల్సిన విషయమే.

పుష్ప 2 హిట్ తో పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు బన్నీ దీనితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో బన్నీ నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తున్నాడన్నది ఆసక్తిగా మారింది. బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో నాలుగోసారి ఒక మూవీ రానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది అని మార్చి నుంచి షెడ్యూల్ మొదలవుతుంది అని టాక్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS