GST గురించిన చర్చ దేశవ్యాప్తంగా నడుస్తున్న వేళ ప్రముఖ తమిళ హీరో విజయ్ అంటోనీ నటించిన తమిళ అనువాద చిత్రం అయిన ఇంద్రసేన కి ఈ GST విషయమై ఒక అడ్డంకి వచ్చింది.
అదేంటంటే- ఈ ఇంద్రసేన చిత్రంలో GST అంటూ సాగే ఒక పాట ఉంది, ఈ మధ్యనే దీని తాలుకా వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈరోజు సెన్సార్ ముందుకి వెళ్ళిన ఈ చిత్రానికి GST అనే పదానికి సంబందిత కమిటీ అభ్యంతరం తెలిపిందట.
GST అనే పధం బదులుగా EMI అనే పధం పెట్టుకోవాడానికి అనుమతిస్తూ ఈ చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందట. ఇక ఈ చిత్రం ఈ నెల 30వ తేదీన విడుదలకానుంది. ఇంద్రసేన చిత్రంలో విజయ్ అంటోనీ సరసన డయానా, మహిమా & మేరీ తదితరులు నటిస్తున్నారు, జీ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు.
మొత్తానికి GST వల్ల ఇబ్బందులు ఎదురుకున్న చిత్రాల జాబితాలో విజయ్ మెర్సల్ సరసన ఈ ఇంద్రసేన (తమిళంలో అన్నాదురై) కూడా చేరిపోయింది.