వెరైటీ టైటిల్ తో గుణశేఖర్

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా కొనసాగిన గుణశేఖర్ ఈ మధ్య కాలంలో కొంచెం వెనకపడ్డాడు. మొదట్లో కమర్షియల్ సినిమాలని కూడా ప్రయోగాత్మకంగా తెరకెక్కించి సక్సెస్ సాధించారు. ఈ మధ్య పౌరాణిక, చారిత్రక నేపథ్యం గల సినిమాలు, ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు వైపు మొగ్గు చూపుతున్నారు. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రుద్రమ దేవి అనే చారిత్రిక సినిమా, సమంతతో శాకుంతలం అనే పౌరాణిక చిత్రం తెరకెక్కించారు గుణ శేఖర్. భారీ సెట్ లు వేయాలంటే  బాలీవుడ్ లో సంజయ్ లీలా బన్సాలి, టాలీవుడ్ లో గుణశేఖర్ అనే పేరు పొందారు. గుణ శేఖర్ చివరిగా శాంకుతలం మూవీతో వచ్చాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో  విజయం సాధించలేక పోయింది. శాంకుతలం తరవాత మళ్ళీ ఇన్నాళ్ళకి గుణ‌శేఖ‌ర్ ఒక  ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. ఈ మూవీకి సంభందించిన డీటెయిల్స్ ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసాడు.


గుణ శేఖర్ కొత్త ప్రాజెక్ట్ ని త‌న సొంత బ్యాన‌ర్ 'గుణ టీమ్‌వ‌ర్క్స్‌'పై నిర్మించనున్నారు. టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ‘యుఫోరియా’ అనే వెరైటీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీని  గుణశేఖర్ వైఫ్ నీలిమా గుణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి టైటిల్ మాత్రమే అనౌన్స్ చేశారు. న‌టీన‌టులు, మిగతా సాంకేతిక సిబ్బంది ఎవ‌రు, ఎప్పటి నుంచి సినిమా ప్రారంభం అవుతుంది అన్న వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్లడించనున్నట్లు సమాచారం. 


మంచి అభిరుచి ఉన్న దర్శకుడు గుణశేఖర్. అదృష్టం కలిసి రాక అపజయాలు చవి చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ హిరణ్య కశ్యప్ కూడా చేజారిపోయింది. దగ్గు బాటి రానాతో హిరణ్య కశ్యప్  ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలని స్క్రిప్ప్ట్ కూడా రెడీ చేసుకున్నాడు గుణ శేఖర్. కానీ రానా దర్శుకుడి పేరు లేకుండా, త్రివిక్రమ్ కథ అందిస్తారంటూ  అదే సినిమా  అనౌన్స్ చేసాడు. గుణశేఖర్ ఈ యుఫోరియా సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS