డార్లింగ్ ప్రబాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 AD రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ సన్షేషన్స్ సృష్టిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీలో ప్రభాస్ వాడిన వెహికల్ 'బుజ్జి'ని ఇంటర్డ్యూస్ చేశారు. ఈ బుజ్జి ని కల్కి కోసం స్పెషల్ గా డిజైన్ చేసినట్టు వెల్లడించారు. భవిష్యత్ లో రాబోయే ఆధునిక వాహనాలు కల్కిలో దర్శన మివ్వనున్నాయని బుజ్జిని చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో అని సినీప్రియులు ఎదురుచూస్తున్నారు. కల్కి లో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్, కమల హాసన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కల్కి మూవీ జూన్ 27న రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో థియేటర్స్ రైట్స్ సేల్ జరుగుతోంది.
రీసెంట్ గా ఉత్తర అమెరికా థియేటర్ హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ -AA క్రియేషన్స్ సంయుక్తంగా కొనుగోలు చేసినట్లు సమాచారం. రిఫండబుల్ అడ్వాన్స్ ప్రాతిపదికన డిస్ట్రిబ్యూటర్లు 50 కోట్లను చెల్లించారని ఫిలిం నగర్ టాక్. ఇప్పటివరకు ఒక ఇండియన్ సినిమాకి ఈ రేంజ్ లో డిమాండ్ రాలేదు. అదీ ఒక తెలుగు హీరో సినిమాకి ఏకంగా 50 కోట్ల పెట్టుబడి పెట్టడం అంటే అది ప్రభాస్ పై ఉన్న నమ్మకమే అని చెప్పొచ్చు. ఇంతకముందు కూడా ఇదే సంస్థ ప్రభాస్ సలార్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి చాలా లాభాలు గడించింది. అందుకనే ఇప్పుడు కల్కి విషయంలో కూడా ఎక్కడ తగ్గటం లేదు.
అమెరికా లాంటి దేశంలో ఒక తెలుగు సినిమా రిలీజ్ అయ్యి 50 కోట్లు రాబట్టడం అంటే సందేహించాల్సిన విషయమే. కానీ ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి 2, సలార్ లాంటి సినిమాలను దృష్టి లో పెట్టుకుని ప్రభాస్ కి ఉన్న మార్కెట్ దృష్ట్యా ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ నమ్మకంగా అడుగువేసింది. డార్లింగ్ నటించిన బాహుబలి 2 అమెరికాలో రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే 30 కోట్లు వసూల్ చేసింది. సెకండ్ డే 20 కోట్లు వసూల్ చేసి కేవలం రెండు రోజుల్లో మొత్తం 50 కోట్లు పైగా రాబట్టింది. కాబట్టి కల్కి 5O కోట్లు వసూళ్లు పెద్ద కష్టం కాదని ట్రేడ్ పండితుల అభిప్రాయం.