Hiranyakashyapa: హిరణ్యకశ్యప చేతులు మారిందా ?

మరిన్ని వార్తలు

పౌరాణిక, కమర్షియల్‌ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు గుణశేఖర్‌. ‘రుద్రమదేవి’ తర్వాత విరామం తీసుకున్న ఆయన ‘హిరణ్యకశ్యప’ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు. ఇందులో రానా టైటిల్‌ రోల్‌. గత మూడేళ్లుగా ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని గతేడాది జూన్‌లో గుణశేఖర్‌ ప్రకటించారు గుణశేఖర్. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది.

 

ఐతే ఇప్పుడీ సినిమా చేతులు మారినట్లు తెలుస్తోంది. గుణశేఖర్ చేసిన స్క్రిప్ట్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సురేష్ బాబు సినిమా నుండి డ్రాప్ అయ్యారని టాక్. అంతేకాదు ఈ సినిమా చేతులు మారి తివిక్రమ్ దగ్గరకి వెళుతుందని, హరిక హాసినీ నిర్మాణంలో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకేక్కిస్తారని వినిపిస్తోంది. ఈ మేరకు తివిక్రమ్, రానాకి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. మహేష్ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో మరో సినిమా చేయాలి త్రివక్రమ్. ఈ సినిమా తర్వాత హిరణ్యకశ్యప సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS