మహేశ్‌బాబు - రాజమౌళి కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. రాజమౌళి ఇప్పుడు మహేష్ సినిమా కోసమే సమయం అంతా కేటాయిస్తున్నారు. మహేశ్‌బాబు, త్రివిక్రమ్ సినిమా పూర్తవ్వగానే... రాజమౌళి సినిమా షురూ కానుంది. కాగా, ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూవీపై రాజమౌళి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న రాజమౌళి దీనిని గురించి మాట్లాడుతూ... ‘ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది ఉంటుందని తెలిపారు.
ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇందుకు రెండు కథలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ సిద్ధం చేయగా, జేమ్స్‌బాండ్ తరహాలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.