రుద్రమదేవి తరవాత మరో సినిమా చేయలేదు గుణశేఖర్. రానాతో హిరణ్య కశ్యప కథ తీయాలని గట్టిగా ప్రయత్నించాడు. స్క్రిప్టు కూడా రెడీ. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయితే రానా బిజీగా ఉండడంతో.. ఆ ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది. ఈలోగా ఖాళీగా ఉండడం ఎందుకని `శాకుంతలమ్`ని పట్టాలెక్కించబోతున్నాడు. ఇందులో శకుంతల పాత్రలో సమంత కనిపించనుంది. మరి దుశ్యంతుడు ఎవరన్నదే హాట్ టాపిక్. దుశ్యంతుడు ఎవరో గుణశేఖర్ ప్రకటించకపోయినా.. చాలా పేర్లు వార్తల్లో వినిపిస్తున్నాయి.
రానా, అల్లు అర్జున్ వీళ్లలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్సుందని ప్రచారం మొదలైంది. ఓ మలయాళ స్టార్ హీరోని ఎంచుకున్నారని, బాలీవుడ్ హీరోని దింపుతున్నారని రకరకాల వార్తలొస్తున్నాయి. వీటిపై గుణ క్లారిటీ ఇచ్చేశాడు. దృశ్యంతుడెవరో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, ఇప్పటి వరకూ వినిపించిన పేర్లన్నీ పుకార్లే అని.. త్వరలోనే దుశ్యంతుడు ఎవరో అధికారికంగా ప్రకటిస్తామని ప్రకటించారు. అంటే.. రానా, బన్నీ లు.. ఈ లిస్టులో లేరన్నమాట.