ఇటు సినిమా.. అటు వెబ్ సిరీస్ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు స్టార్ కథానాయికలు. ఈ జాబితాలో శ్రుతిహాసన్ కూడా ఉంటుంది. ఇటీవలే క్రాక్ సినిమాతో ఓ హిట్ అందుకుంది శ్రుతి. ఇప్పుడు పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్`లోనూ నటిస్తోంది. తాజాగా.. `పిట్టకథలు` వెబ్ మూవీ పూర్తి చేసింది. నలుగురు దర్శకులు రూపొందించిన ఆంథాలజీ ఇది. నాగ అశ్విన్ `ఎక్స్ లైఫ్` అనే కథని తెరకెక్కించారు. ఇందులో శ్రుతిహాసన్ ప్రధాన పాత్రధారి. శ్రుతి పాత్ర ఇందులో చాలా బోల్డ్ గా హాట్ గా ఉండబోతోందట.
తను లెస్బియన్ గా కనిపించనుందని తెలుస్తోంది. నిజానికి ఈ నాలుగు కథలూ ఆడవాళ్లు, వాళ్ల ప్రవర్తన చుట్టూ తిరిగేవే. అవన్నీ గీత దాటే ఉంటాయని తెలుస్తోంది. మంచు లక్ష్మి, ఇషా రెబ్బా, అమలాపాల్ పాత్రలు సైతం చాలా బోల్డ్ గా ఉంటాయని సమాచారం. ఇటీవల నిత్యమీనన్, అంజలి.. ఇలాంటి బోల్డ్ పాత్రల్లోనే నటించారు. ఇప్పుడు శ్రుతి వంతు వచ్చిందంతే! ఫిబ్రవరి 19న నెట్ ఫ్లిక్స్‌లో `పిట్టకథలు` విడుదల అవుతున్నాయి.