గుణశేఖర్ చిత్రం `శాకుంతలమ్`లో శాకుంతల ఎవరు అనే చర్చ భారీ ఎత్తున సాగింది. అందరి దృష్టీ అనుష్క వైపే. రుద్రమదేవి తో అనుష్కతో గుణ శేఖర్ బాండింగ్ పెరిగింది. అనుష్క కోసమే.. శాకుంతలమ్ సినిమా తీస్తున్నాడని చెప్పుకున్నారు. అనుష్క కూడా ఈ సినిమాలో పారితోషికం తీసుకోకుండా నటిస్తోందని అన్నారు. అనుష్క బాగా లావుగా కనిపిస్తోంది. శకులంత పాత్రకు సెట్ అవుతుందా? అనే అనుమానాలు తలెత్తాయి. అయినా సరే.. గుఖశేఖర్ వైఖరి తెలిసినవాళ్లంతా.. అనుష్కనే శాకుంతల అని ఫిక్సయ్యారు.
అయితే. ఇప్పుడు ఆ పాత్ర కోసం సమంతని ఎంచుకుని అందరినీ షాక్ ఇచ్చాడు గుణ. సడన్ గా అనుష్క ప్లేసులోకి సమంత వచ్చిందా? లేదంటే ముందు నుంచీ ఈ పాత్రకు సమంతనే బెస్ట్ ఆప్షన్ అని గుణశేఖర్ అనుకుంటున్నాడా? అనేది తెలియడం లేదు. మొత్తానికి శాకుంతల పాత్రలో సమంత ఫిక్సయిపోయింది. ఓ బేబీ తరవాత.. సమంత కొత్త సినిమాలేం ఒప్పుకోలేదు. అఫీషియల్ గా తాను సంతకం చేసింది ఈ సినిమాకే.