సమంత నటించిన `యశోద` ఇటీవలే విడుదలై బిలో యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోయింది. డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో... నిర్మాతకు డబ్బులు వచ్చాయి. లేదంటే.. యశోద నష్టాల్లో కూరుకుపోయేది. మొత్తమ్మీద.... యశోద సేఫ్ ప్రాజెక్ట్ గా నిలిచింది. అయితే ఈ రిజల్ట్ గుణశేఖర్ ని భయపెడుతోంది. ఎందుకంటే.. సమంతతో ఆయన రూపొందించిన `శాకులంతలమ్` ఇప్పుడు విడుదలకు రెడీ అయ్యింది. ఇది కూడా సమంత ఇమేజ్ ని బేస్ చేసుకొని తీసిన సినిమానే. `యశోద`కీ...`శాకుంతలమ్`కీ తేడా ఏమిటంటే.. బడ్జెట్. యశోద రూ.25 కోట్లలో పూర్తయితే, శాకుంతలమ్ కి రూ.70 కోట్లయ్యింది. అంటే మూడు రెట్లు తేడా. యశోదలా అరకొర వసూళ్లొస్తే.. శాకుంతలమ్ తేరుకోదు. సమంత కోసమే థియేటర్లకు వెళ్లే జనాలు చాలా తక్కువే అని `యశోద` రిజల్ట్ తేల్చేసింది. `శాకుంతలమ్` డబ్బులు తిరిగి రావాలంటే.. చాలా పెద్ద హిట్ అనిపించుకోవాలి. పైగా.. ప్రమోషన్లు భారీగా చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమంత ప్రమోషన్లకు వస్తుందా, రాదా? అనేది అనుమానమే. ఈ దశలో.... తన రూ.70 కోట్లు ఎలా రాబట్టుకోవాలో తెలీక... గుణశేఖర్ మల్లగుల్లాలు పడుతున్నాడు. యశోద పూర్తిగా కొత్త దర్శకులు రూపొందించిన చిత్రం. శాకుంతలమ్ కి గుణశేఖర్ ఇమేజ్ కలిసొస్తుంది. అదొక్కటే... శాకుంతలమ్ సినిమాని ఆదుకోగలదు.