'ఆర్.ఎక్స్ 100'తో దర్శకుడిగా అజయ్ భూపతి పేరు కాస్త గట్టిగా వినిపించింది. చాలా తక్కువ బడ్జెట్‌లో, ఇంపాక్ట్ ఉన్న ఓ కథని బాగా డీల్ చేశాడు. సూపర్ హిట్టు కొట్టాడు. ఈ సినిమాతో చాలామంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. ఆ తరవాత... తీసిన `మహా సముద్రం` నిర్మాతల్ని బాగా ముంచేసింది. ఈ సినిమా డిజాస్టర్ గా తేలిపోయింది. మహా సముద్రం విడుదలై - ఇంత కాలమైనా, అజయ్ భూపతి తదుపరి సినిమాపై ఎవరికీ క్లారిటీ రాలేదు. `మహాసముద్రం` డిజాస్టర్ చూసి నిర్మాతలు, హీరోలు వెనకడుగు వేసి ఉండొచ్చు. అయితే ఎట్టకేలకు ఓ ప్రాజెక్ట్ ని సెట్ చేశాడు అజయ్ భూపతి.
`మంగళవారం` అనే టైటిల్ తో ఓ సినిమా తీస్తున్నాడట అజయ్ భూపతి. ఇదో లేడీ ఓరియెంటెడ్ సినిమా అనీ, గ్రామీణ నేపథ్యంలో సాగబోతోందని టాక్. ఓ ప్రముఖ కథానాయిక ఈ సినిమాలో లీడ్ గా నటించబోతోంది. `మంగళవారం` వెబ్ మూవీ అని, ఇది థియేటర్ సినిమా కాదని ఇంకో టాక్. అయితే అజయ్ భూపతి.. ఈ విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. సినిమా అంతా రెడీ అయ్యాక అప్పుడు డిసైడ్ అవుతాడట. ఓ రోజులో పూర్తయిపోయే కథ కాబట్టి.. దీనికి `మంగళవారం` అనే టైటిల్ ఫిక్స్ చేశాడని సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.