సింగపూర్‌ సిరిమల్లె కెవ్వుకేక

మరిన్ని వార్తలు

'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ చేస్తున్న ముద్దుగుమ్మ అందాల హంసానందిని అన్న సంగతి తెలిసిందే. 'సింగపూర్‌ సిరిమల్లె' అంటూ ఐటమ్‌ సాంగ్‌లో దుమ్ము రేపేసింది ఈ భామ. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ట్రెండింగ్‌లో ఉంది. రాజ్‌తరుణ్‌ డిఫరెంట్‌ రోల్‌తో ఆకట్టుకోనున్నాడు ఈ సినిమా ద్వారా. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్‌ గ్లామర్‌ మరో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌. తొలి సినిమా 'మజ్ను'లో ట్రెడిషనల్‌గా నార్మల్‌గా కనిపించిన ఈమె అందం ఈ సినిమాలో కొంచెం డోస్‌ పెంచింది. ఏకంగా యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌తో లిప్‌ లాక్‌ కూడా లాగించేసింది. అందేకాదు చాలా గ్లామరస్‌గా కనిపించనుందట కూడా. ఫిబ్రవరి 17న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్‌ నటుడు అర్భాజ్‌ ఖాన్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండడం విశేషం. 'వీడో రకం ఆడో రకం' సినిమా తర్వాత రాజ్‌ తరుణ్‌ నటిస్తున్న సినిమా ఇది. ఇంతవరకూ తన ఈజీ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్న రాజ్‌తరుణ్‌ ఈ సారి కూడా అదే రేంజ్‌లో ఎంటర్‌టైన్‌ చేయనున్నాడు. డిఫరెంట్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫుల్‌ లెవల్‌లో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేయనుందట. కుక్కల్ని చూస్తే చాలు దాన్ని కిడ్నాప్‌ చేసేసేదాకా ఆగని కిట్టుగాడి పాత్రలో రాజ్‌ తరుణ్‌ నటన ఆకట్టుకోనుందట. పబ్లిసిటీ ఓ రేంజ్‌లో సాగుతూ, అంతకుమించి ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోన్న ఈ సినిమాతో రాజ్‌ తరుణ్‌ ఏ స్థాయిలో మ్యాజిక్‌ చేస్తాడో చూడాలంటే ఇంక కొన్ని రోజులు మాత్రమే వేచి చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS