హన్సిక గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బాయ్ ఫ్రెండ్ సోహైల్‌తో కలిసి ఏడు అడుగులు వేసింది. అయితే సోహెల్ కి ఇది రెండో పెళ్లి. అంతకుముందే సోహెల్ పెళ్లి చేసుకున్నాడు. ఏవో కారణాల వల్ల విడాకులు కూడా తీసుకున్నాడు. సోహెల్ పెళ్లి చేసుకున్నప్పుడు హన్సిక కూడా ఆ పెళ్లికి హాజరైంది. అప్పటి నుంచే హన్సిక, సోహెల్ మధ్య స్నేహం ఉంది. అయితే సోహెల్ భార్యతో విడిపోయిన తర్వాత హన్సిక కారణంగానే విడాకులు తీసుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై హన్సిక స్పందించింది.
‘’సోహైల్ గురించి మొదట్లో వార్తలు వచ్చినప్పుడు ఎంతో ఒత్తిడికి లోనయ్యాను. అతడికి గతంలోనే పెళ్లి అయ్యిందని వార్తలు వచ్చాయి. ఆ పెళ్లిలో నేను పాల్గొన్న ఫొటోలు షేర్ చేస్తూ.. సోహైల్ తన భార్య నుంచి విడిపోవడానికి నేనే కారణం అని విమర్శలు చేశారు. నిజం చెప్పాలంటే, నా భర్త గతం నాకు తెలుసు. అతడి విడాకులకు నేను కారణం కాదు’’ అని చెప్పుకొచ్చింది హన్సిక.