సౌత్‌లో హీరోయిన్లు ఎక్స్పోజింగ్ ఎక్కువగా చేయాలి. అలా చేస్తేనే అక్కడి ప్రేక్షకులు చూస్తారు. అలా ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేసే వాళ్లకే అక్కడ హీరోయిన్స్‌గా ఛాన్సెస్ దక్కుతాయి.. అని బాలీవుడ్ బుల్లితెర నటి హీనాఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలకు ముద్దుగుమ్మ హన్సికకు ఒళ్లు మండిపోయిందట. మా సౌత్ ఇండస్ట్రీ గురించి అంత చీప్‌గా ఎలా మాట్లాడుతావ్.. అలా మాట్లాడేవాళ్లకు బుద్ధుండాలి. ఎక్స్పోజింగ్ విషయానికి వస్తే, సౌత్‌లో కన్నా బాలీవుడ్లోనే ఎక్కువ.. అని ముద్దుగుమ్మ హన్సిక హీనాఖాన్కి రీ కౌంటర్ ఇచ్చిందట. అరతేకాదు ఎక్స్పోజింగ్ అనేది సినిమాని బట్టి, కథని బట్టి ఉంటుంది. సౌత్‌లో హీరోయిన్గా నటిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడి అభిమానుల నుండి పొందే అభిమానం, గౌరవం చాలా గొప్పవి. నేనే కాదు చాలా మంది బాలీవుడ్ నుండి సౌత్‌కి వచ్చిన ముద్దుగుమ్మలు ఇక్కడ హీరోయిన్స్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.. స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు.. అని ముద్దుగుమ్మ హన్సిక హీనాఖాన్‌పై మండిపడింది. హన్సికకి అందమే కాదండోయ్. కొంచెం కోపం కూడా ఎక్కువే ఉన్నాయ్. అయితే చిన్న నటి అయిన హీనాఖాన్ సౌత్ భామల విషయంలో అలా అనగానే ముద్దుగుమ్మ హన్సికకి అంత కోపమొచ్చిందే.. మరి కొన్ని రోజుల క్రితం తన తోటి హీరోయిన్, సౌత్‌లో పలు చిత్రాల్లో నటించిన భామ అయిన తాప్సీ ఇలాగే మాట్లాడితే.. అప్పుడు హన్సిక ఎందుకు స్పందించలేదు. తాప్సీ మాటలు హన్సికకు కోపం తెప్పించలేదా? అప్పుడెందుకు మన హన్సికకి ఒళ్లు మండలేదట చెప్మా!