అందాల రాక్షసితో ఆకట్టుకున్న దర్శకుడు హను రాఘవపూడి. ఆ తరవాత కృష్ణగాడి వీర ప్రేమగాథతో ఓ హిట్ అందుకున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న `లై` నిరాశ పరిచింది. ఇప్పుడు `పడి పడి లేచె మనసు` పరిస్థితి కూడా ఇంతే. లవ్ స్టోరీల్ని బాగా డీల్ చేయగలడు అనే పేరు తెచ్చుకున్న హను... అందులో తప్ప, మిగిలిన అన్ని విభాగాల్లోనూ ఫెయిల్ అయ్యాడు.
అయితే... హనుపై నమ్మకాలు మాత్రం తగ్గట్లేదు. మైత్రీ మూవీస్ హనుకి ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ హనుతో ఓ సినిమా చేయడానికి ఫిక్సయ్యాడని సమాచారం. `పడి పడి లేచె మనసు` ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి అల్లు అర్జున్ హాజరయ్యాడు. హను ప్రేమకథలు తీసే విధానాన్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు.
ఆ తరవాత.. హనుని తన ఆఫీసుకు పిలిపించుకుని కథ విషయమై మాట్లాడాడట. `ఓ మంచి కథ చెప్పు.. కలిసి పనిచేద్దాం` అని ఆఫర్ ఇచ్చాడట. హను మైత్రీలో చేయబోయే సినిమాకి బన్నీనే హీరో అయ్యే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. మైత్రీ కూడా అల్లు అర్జున్‌కి ఇది వరకే అడ్వాన్స్ ఇచ్చింది. సో.. ఈ కాంబినేషన్ దాదాపుగా ఖాయమయ్యే అవకాశాలున్నాయి.