గ్లామ్‌షాట్‌: ఘాటు గ్లామర్‌కి ట్వీటేయాల్సిందే.!

By iQlikMovies - December 26, 2018 - 13:10 PM IST

మరిన్ని వార్తలు

క్రిస్టమస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా అందమైన భామలు తమ అందాలను ప్రత్యేకంగా ఎక్స్‌పోజ్‌ చేస్తూ, విషెస్‌ చెప్పడం ట్రెండీ అయిపోయిందిప్పుడు. ఇలా హాట్‌ హాట్‌ గ్లామర్‌తో క్రిస్టమస్ విషెస్‌ చెప్పడానికి శ్రీకారం చుట్టింది సెక్సీ ఐటెం పూనమ్‌ పాండే. తర్వాత ఆ ఫార్ములాని షెర్లీన్‌ చోప్రా తదితర హాట్‌ భామలు కంటిన్యూ చేస్తూ వచ్చారు. 

 

తాజాగా సోషల్‌ మీడియా హాట్‌ స్టార్‌ అయిన దిశాపటానీ కూడా ఇదే ఫార్ములా ఫాలో చేసింది. అయితే ఎప్పటికప్పుడే హాట్‌ పిక్స్‌తో రెచ్చగొట్టడం ఈ ముద్దుగుమ్మకేం కొత్తకాదులెండి. ఈ మధ్య కాల్విన్‌ క్లెయిన్‌ ఇన్నర్‌ వేర్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారి ఈ అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 

 

ఇకపోతే తాజాగా క్రిస్టమస్ కోసం ఇచ్చిన మరో బికినీ పోజు ఇప్పుడు వైరల్‌ అయ్యింది. వైట్‌ అండ్‌ వైట్‌ బికినీలో కళ్లకు బ్లాక్‌ గాగుల్స్‌ పెట్టుకుని దిశా ఇచ్చిన పోజుకు కుర్రకారు గుండెలు బేజారయిపోతున్నాయంటే నమ్మి తీరాల్సిందే. ఇంత హాట్‌గా కూడా క్రిస్టమస్ విషెస్‌ చెప్పొచ్చా అనిపించి, లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS