క్రేజీ హీరోని పట్టేసిన ప్రశాంత్ వర్మ

మరిన్ని వార్తలు

హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా సూపర్  స్టార్ అయిపోయాడు ప్రశాంత్ వర్మ. విజువల్  వండర్ గా వచ్చిన హనుమాన్ చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా అందర్నీ అలరించింది. అన్ని భాషల్లోనూ హిట్ టాక్ తెచ్చుకుని వసూళ్లు సాధించింది. నెక్స్ట్ ప్రశాంత్ వర్మ ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తాడా అని అంతా ఆసక్తిగా ఉన్నారు. మొదటి సినిమానుంచే విభిన్నంగా ఆలోచిస్తూ, ప్రయోగాత్మక ప్రాజెక్ట్స్ తో తన మార్క్ చూపిస్తున్నాడు ప్రశాంత్. తనకి రొటీన్ సినిమాలు చేయటం నచ్చదని, డిఫరెంట్ కథలు, కొత్త జోనర్ లో కథలు చేయటమే ఇష్టమని ఇప్పటికే పలుసందర్భాల్లో వెల్లడించాడు.      


ప్రజంట్ హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కిస్తున్నాడు. ఇది కాకుండా ఒక లేడి  ఓరియెంటెడ్ సినిమా కూడా స్టార్ట్ చేశాడు ఇది హనుమాన్ కంటే ముందు అనుకున్న కథే. కానీ బ్రేక్ వచ్చింది. ఇప్పుడు దానిని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. పలువురు బాలీవుడ్ హీరోలు కూడా ప్రశాంత్ తో సినిమాలు చేయాలని, చర్చలు జరుపుతున్నట్టు టాక్. రణవీర్ సింగ్  ఒక మంచి డివోషనల్ జోనర్ కోసం ఇప్పటికే ప్రశాంత్ తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ప్రశాంత్ జై హనుమాన్ తరవాత అల్లు అర్జున్ తో వర్క్ చేసే  ప్రయత్నంలో ఉన్నట్టు టాక్.  ఇందుకోసం  అల్లు అర్జున్ కు ఒక లైన్ వినిపించాడట. బన్నీకి కూడా ఆ కాన్సెప్టు బాగా నచ్చి, ఇంట్రస్ట్ చూపిస్తున్నాడని సమాచారం.  జై హనుమాన్ సినిమా కంప్లీట్ అయ్యాక పూర్తి స్క్రిప్ట్ ను బన్నీ ముందు ఉంచనున్నాడట ప్రశాంత్. 


ప్రశాంత్ వర్మ కెరియర్ హనుమాన్ కి ముందు, తరవాత అన్నట్టు ఉంది. ఇప్పుడు ప్రశాంత్ అడిగితే తనతో కలిసి వర్క్ చేయటానికి, ఎంత పెద్ద స్టార్ అయినా నో చెప్పే ప్రసక్తే లేదు. తక్కువ బడ్జెట్ లోనే సినిమాని బాగా తీర్చి దిద్దుతాడు. విజువల్స్ విషయంలో ప్రశాంత్ కి వందకి వంద మార్కులు పడ్డాయి. మొత్తానికి బన్నీ లాంటి నేషనల్ స్టార్ తో కలిసి వర్క్ చేసే అవకాశం ప్రశాంత్ కి దక్కితే, రాజమౌళి స్థాయిలో గుర్తింపు పొందటం ఖాయం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS