తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన ‘హనుమాన్’ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ ప్రభంజనం సృష్టించింది. అత్యధిక వసూళ్లు సాధించి రికార్డులు తిరగరాసింది. జనవరి 11న వేసిన ప్రీమియర్ షోలతో బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ ఆ తర్వాత షోలు, స్క్రీన్స్ పెంచుకుంటూ భారీ కలెక్షన్స్ ను వసూల్ చేసింది.
వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇప్పటివరకు 260 కోట్ల పైనే గ్రాస్ ను కొల్లగొట్టి 140 కోట్ల షేర్ మార్క్ ను దాటేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 23 రోజులు పూర్తి అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 141 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఔరా అనిపించుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 277.9 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఇప్పటివరకు 118.67 కోట్ల లాభాలను అందించింది.
24వ రోజు కూడా సండే హాలిడే అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ సాధించి, 142.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో మా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 280 కోట్ల మార్క్ ని దాటేసి ఆల్ మోస్ట్ 282 కోట్లకు చేరుకుంది. టాలీవుడ్ లో 92 ఏళ్లలో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఈ కలెక్షన్స్ ఆల్ టైం ఎపిక్ హైయెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్స్ అనే చెప్పాలి.