నందమూరి నటసింహం బాలయ్య బాబు 2023 లో భగవంత్ కేసరితో భారీ హిట్ అందుకున్నారు. ఈ మూవీతో బాలయ్య నందమూరి ఫాన్స్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మెప్పించారు. కమర్షియల్ అంశాలతో పాటు, మంచి మెసేజ్ కూడా ఉండటంతో అందర్నీ మెప్పించింది ఈ మూవీ. బాలయ్య ఈ కథకి అనుగుణంగా తన పరిధి తగ్గించుకుని మరీ యాక్ట్ చేశారనటం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అనిల్ రావి పూడి తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్, శ్రీలీల, హీరోయిన్స్ గా అర్జున్ రాంపాల్ విలన్ గా నటించారు. దసరా బరిలో రిలీజై 120 కోట్లకు పైగా వసూలు చేసింది. మొట్ట మొదటిసారి అనిల్ రావి పూడి కూడా తనకి కలిసి వచ్చిన కామెడీ జోనర్ నుంచి బయటికి వచ్చి భగవంత్ కేసరి లాంటి మూవీ చేసాడు.
ఆడపిల్ల అంటే కేవలం పెళ్లి చేసుకుని, పిల్లలని కని ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా, తన కాళ్లపై తాను నిలబడాలి, స్వతహాగా బలహీనురాలైన స్త్రీ ఏవిధంగా శక్తివంతంగా తయారవగలదో అనే కథాంశంతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే పాయింట్ ని కూడా చూపిస్తూనే, కమర్షియల్ సినిమాగా తెరకెక్కించారు. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా రీమేక్ రైట్స్ కోసం మిగతా సినీ పరిశ్రమల సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడుతున్నారని టాక్ నడుస్తుంది.
ఈ సినిమాలో బాలకృష్ణ ఏజ్ కి తగ్గట్టుగా శ్రీలీలకు తండ్రి లాంటి పాత్ర పోషించారు. దీంతో సేమ్ ఏజ్ లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ట్రై చేస్తున్నారని టాక్. అంతేకాదు తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఈ సినిమా రైట్స్ తీసుకుందామని అనుకుంటున్నారట. ప్రస్తుతం విజయ్ 69వ సినిమా చేస్తున్నారు. ఇటీవలే అధికారికంగా పార్టీ ప్రకటించి 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమా అయ్యాక 70వ సినిమాగా భగవంత్ కేసరి రీమేక్ చేస్తే పొలిటికల్ గా కలిసొస్తుంది అని, లేడి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని విజయ్ భావిస్తున్నట్టు సమాచారం. ఫైనల్ గా బాలయ్య బాబు భగవంత్ కేసరి సినిమా ఏ భాషలో ఏ హీరో రీమేక్ చేస్తారో చూడాలి.