బెల్లంకొండ అంతకుమించి

మరిన్ని వార్తలు

'అల్లుడు శీను' అంటూ వచ్చాడు. చాలా దగ్గరయిపోయాడు తెలుగు ప్రేక్షకులకి. బెల్లంకొండ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఆరడుగుల కటౌట్‌. డాన్సులు, ఫైట్లు ఇరగదీస్తాడు. తొలి సినిమాకే నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ అయిన సమంతతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేశాడు ఈ యంగ్‌ హీరో. తరువాతి సినిమా 'స్పీడున్నోడు'తో మరింత జోరు పెంచాడు. కానీ ఆ సినిమా బాక్సీఫీస్‌ వద్ద అనుకున్న ఫలితాన్ని అందివ్వలేకపోయింది. దాంతో ఇప్పుడు అంతకుమించిన జోష్‌తో వస్తున్నాడు. బోయపాటి శీను డైరెక్షన్‌లో బెల్లంకొండ కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని హీరోయిన్‌గా ఎంచుకున్నారు. బోయపాటి శీను ఇటీవలే 'సరైనోడు' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టాడు. అదే జోరుని ఈ సినిమాతో కొనసాగించాలనుకుంటున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌ను చాలా కొత్తగా స్టైలిష్‌గా చూపించబోతున్నాడు ఈ సినిమాలో. ఈ రోజు బెల్లంకొండ శ్రీనివాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. క్లాస్‌ లుక్‌లో కనిపిస్తూ, మాస్‌ని ఎట్రాక్ట్‌ చేసేలా ఉంది ఈ లుక్‌. ఈ సినిమాలో డాన్సులు, ఫైట్లూ చాలా కొత్తగా ఉండబోతున్నాయట. టోటల్‌గా బెల్లంకొండ ఈ సినిమాతో సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కేస్తానంటున్నాడు. ఎందుకంటే ఈ సినిమాకి అన్నీ ప్లస్‌ పాయింట్సే. సక్సెస్‌ మెజార్టీ ఎక్కువగా ఉంది. ఒక పక్క సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ బోయపాటి, మరో పక్క హ్యాట్రిక్‌ కొట్టడానికి రెడీగా ఉన్న బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నీ వెరసి ఈ సినిమా స్టోరీ కూడా యాక్షన్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. సో ఇన్ని శుభశకునాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో బెల్లంకొండకు అంతా శుభమే జరగాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేద్దాం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS