అలేఖ్య హారిక, యూ ట్యూబర్‌గా బోల్డంత పేరు, ప్రఖ్యాతులు సాధించేసింది. అలా వచ్చిన పాపులరిటీ పుణ్యమా అని ఆమెకు చాలామంది అభిమానులు కూడా వున్నారు. బిగ్ బాస్ రియాల్టీ షో కంటెస్టెంట్ అయ్యాక, ఆమెకు ఆ అభిమానుల నుంచి మద్దతు బాగానే లభిస్తోంది. మరీ ముఖ్యంగా హౌస్‌లో, అబిజీత్‌కి కాస్త క్లోజ్‌గా మూవ్ అవుతుండడంతో ఆమెకు ఇంకాస్త అదనపు ఫాలోయింగ్ వచ్చిపడింది.
అయితే, ఈ మధ్య హారిక ఎందుకో ప్రతి విషయానికీ కన్‌ఫ్యూజ్ అవుతోంది. హారిక కెప్టెన్ అవడంలో కీలక పాత్ర పోషించింది మోనాల్ గజ్జర్. అలాంటి మోనాల్ గజ్జర్, ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అవకుండా సేవ్ అయితే, ఆమెను మళ్ళీ నామినేషన్స్‌లోకి నెట్టేసింది హారిక. సాయం చేసినోళ్ళకి వెన్నుపోటు పొడవటమంటే ఇదే మరి. అక్కడితో ఆగలేదు, తాజాగా.. అఖిల్‌కీ వెన్నుపోటు పొడిచింది హారిక. అలాగని, అవినాష్‌కి పూర్తి మద్దతు ఇచ్చిందా.? అంటే అదీ లేదు. దండ కాస్తా అవినాష్ మెడలో వేసి, అఖిల్ మీద ప్రేమను చాటుకుంది.
హారిక తీరుతో అవినాష్ అప్పటికి హ్యాపీ ఫీలయ్యాడుగానీ, కంటెస్టెంట్స్ దృష్టిలోనూ, బిగ్‌బాస్ వ్యూయర్స్ దృష్టిలోనూ హారిక చాలా బ్యాడ్ అయిపోయింది. ఏదో ఒక నిర్ణయంతో వుండాలి కంటెస్టెంట్స్. అదే వారికి బయట మంచి గుర్తింపునిస్తుంది. కానీ, హారిక పూర్తిగా కన్‌ఫ్యూజ్ అవుతోంది. సీజన్ ముగింపు ధశలో హారిక తడబడుతున్న తీరు చూస్తోంటే, ఆల్ ఆఫ్ షడెన్ ఆమె హౌస్ నుంచి ఎప్పుడైనా ఎవిక్ట్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదేమో.!