అలేఖ్య హారిక అలియాస్ డేత్తడి హారికకి కింగ్ అక్కినేని నాగార్జున బిగ్‌బాస్ రియాల్టీ షో వీకెండ్ ఎపిసోడ్‌లో పీకిన క్లాస్ ఫలించినట్లే వుంది. తన ఆలోచనల్ని పక్కన పెట్టి, తన గేమ్‌నీ పక్కన పెట్టి.. అబిజీత్‌ని ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ చేసేసింది. దెయ్యాల టాస్క్ సందర్భంగా, మోనాల్‌తో డేటింగ్‌కి వెళ్ళాల్సి వస్తే.. అబిజీత్, అందుకు ఒప్పుకోలేదు. దాన్ని నాగార్జున తీవ్రంగా తప్పుపడుతూ అబిజీత్‌కి క్లాస్ తీసుకున్నాడు.
కెప్టెన్ అయి వుండీ హారిక, అబిజీత్‌తో ఆ టాస్క్ చేయించకపోవడంపై నిలదీశాడు. దాంతో, నాగ్ పీకిన క్లాస్‌ని దృష్టిలో పెట్టుకుని, అబిజీత్‌కి వ్యతిరేకంగా ఓటేసింది హారిక. అయితే, అబిజీత్ మాత్రం, 'నీ సమస్యలు నీకు వుండొచ్చు. అది నేను తప్పు పట్టను. కానీ, హౌస్‌లో నువ్వు కాకపోతే ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు.?' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నామినేట్ అవడం, సేవ్ అవడం అబిజీత్‌కి కొత్త కాదు. కానీ, హౌస్‌లో హారికని మాత్రమే అబిజీత్ బాగా నమ్మాడు. నిజానికి, అబిజీత్ విషయంలో కాస్తో కూస్తో జెన్యూన్‌గా వుంటోన్నది కూడా హారిక మాత్రమే. కానీ, ఆమెని కూడా నాగ్ ఇన్‌ఫ్లూయెన్స్ చేసేసి, అబిజీత్‌ని హౌస్‌లో ఒంటరిగా మార్చేశాడు.
మోనాల్ అరుపులు, అవినాష్ స్పష్టత.. ఇలా ఈ వారం నామినేషన్స్ సందర్భంగా కొన్ని ఛమక్కులు కనిపించాయి. అఖిల్ - మోనాల్ మధ్య మరోసారి హైడ్రామా క్రియేట్ చేసింది బిగ్‌బాస్ టీమ్. ఏదిఏమైనా, అబిజీత్‌కి యాంటీ ఓట్ వేయడం ద్వారా హారిక, అబిజీత్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అదే ఆమె ఎలిమినేట్ అవడానికి కారణమైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.