హారర్ సినిమా అంటే.. ఇది వరకు లో బడ్జెట్ కథలే. చిన్న హీరోలు, తక్కువ పెట్టుబడి - ఇదీ హారర్ జోనర్‌లకు ఉండే సౌలభ్యం. అయితే.. క్రమంగా స్టార్లూ ఈ తరహా కథలపై మోజు పడ్డారు. జనాల్ని భయపెట్టాలని చూశారు. అగ్ర కథానాయికలంతా హారర్, థ్రిల్లర్ జోనర్లని టచ్ చేసినవాళ్లే. వాళ్లంతా అయిపోయారు. ఇప్పుడు కాజల్ వచ్చింది. భయపెట్టడానికి. ఇటీవలే కాజల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హనీమూన్ కూడా పూర్తి చేసేసింది. ఇప్పుడు మళ్లీ సెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఈలోగా కొత్త సినిమాల్నీ ఒప్పుకుంది.
ఇటీవల ఓ తమిళ దర్శకుడు కాజల్ కి ఓ కథ చెప్పాడట. ఇది... హారర్ సినిమా. ఇందులో మరో ఇద్దరు టాప్ హీరోయిన్లు కూడా నటిస్తారని తెలుస్తోంది. హారర్ జోనర్ ఇంత వరకూ కాజల్ టచ్ చేయలేదు. అందుకే.. తనకు కొత్తగా ఉంటుందని భావించి, ఈ కథ ఒప్పుకుందని సమాచారం. ఈనెలలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. హీరోయిన్లంతా హారర్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నవాళ్లే. ఇప్పుడు కాజల్ అదృష్టం ఎలా వుందో చూడాలి.