గత వారం ఎలిమినేషన్ నుంచి 'ఎవిక్షన్ ఫ్రీ టిక్కెట్' ద్వారా తప్పించుకున్న అవినాష్, ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడం కష్టమేనన్న అభిప్రాయం బిగ్‌బాస్ వీక్షకుల్లో వ్యక్తమవుతోంది. డైరెక్ట్‌గా ఫినాలెకి అర్హత సాధించేందుకు రేసులో నలుగురు నిలిచారు. అబిజీత్, అఖిల్, సోహెల్, హారిక.. ఆ నలుగురు. వీరిలో హారికకి ప్రస్తుతం తక్కువ ఓట్లు వచ్చాయి. అవినాష్ కంటే కూడా ఆమెకు తక్కువ ఓట్లు రావడం గమనార్హం. ఈ వారం గట్టెక్కితేనే ఆమె ఫినాలె టిక్కెట్ గెలిచినా ఉపయోగం.
అయితే, ఫినాలె టిక్కెట్ కోసం టఫ్ ఫైట్ నడుస్తోంది. అబిజీత్, అఖిల్, సోహెల్ రూపంలో ఆమెకు టఫ్ ఫైట్ ఎదురు కానుంది. ఇదిలా వుంటే, అవినాష్ పట్ల సింపతీ విపరీతంగా పెరుగుతోంది.. దానిక్కారణం, అతన్ని హౌస్‌లో అందరూ ఒంటరిని చేసెయ్యడమే. మరోపక్క, అరియానా గ్లోరీ మద్దతుదారులంతా ఈ వారం అవినాష్‌కి ఓటేసే అవకాశం వుంది. అబిజీత్, హారిక.. ఇద్దరూ ఎలిమినేషన్‌కి నామినేట్ అవడంతో.. ఓట్లు చీలే ప్రసక్తి లేదు. అబిజీత్ అభిమానుల ఓట్లు పూర్తిగా అతనికే పడతాయి.
హారికకి అభిమాన గణం తక్కువగా కనిపిస్తోంది. మరోపక్క, అఖిల్ - మోనాల్.. ఈ ఇద్దరి అభిమానుల ఓట్లూ చీలిపోతున్నాయి. మోనాల్‌కి సహజంగానే ఓటు బ్యాంకు తక్కువ. అఖిల్‌ని అభిమానించేవారు కూడా ఈ మధ్య అతను ఇతర హౌస్ మేట్స్ మీద (సోహెల్, మోనాల్) ఆధారపడుతుండడాన్ని జీర్ణించుకోలేక, పార్టీ మార్చేస్తున్నారు. బిగ్‌బాస్‌లో ఏదైనా జరగొచ్చు.. బిగ్‌బాస్ ఎవర్ని అయినా సేవ్ చేయొచ్చు. ఫైనల్‌గా ఎలిమినేషన్ రేసులో ఎవరు నిలుస్తారో.. అప్పుడు ఓ స్పష్టత రావొచ్చు ఎవిక్షన్‌కి సంబంధించి. ప్రస్తుతానికైతే హారిక, అవినాష్‌ల మెడ మీద 'కత్తి' వేలాడుతోంది.