ఎన్టీఆర్ - రామ్ చరణ్ -రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్.... `ఆర్.ఆర్.ఆర్`. ఈ సినిమాలో ఎన్టీఆర్ .. పులితో తలపడే ఓ సన్నివేశం ఉందని ప్రచారం సాగుతోంది. ఆ మధ్య ఈ సీన్‌కి సంబంధించిన ఫుటేజ్ కూడా కాస్త లీకైంది. సో... ఎన్టీఆర్ - పులి సీన్ ఉందని రూఢీ అయిపోయింది. అయితే.. ఈ సీన్‌లో విచిత్రం ఏమిటంటే... పులి ఎన్టీఆర్ ని తరమడం కాదు. ఎన్టీఆరే పులిని తరుముకుంటూ వెళ్తాడట. ఎన్టీఆర్ కి దొరక్కుండా పులి.. పారిపోతూ ఉంటుందట. వినడానికి కామెడీ గా ఉంది గానీ, `ఆర్.ఆర్.ఆర్`లో హైలెట్ అనిపించదగిన సన్నివేశం ఇదేనట. ఇటీవలే.. ఈ సన్నివేశం మొత్తం ఎడిడ్ చేసి, ఆర్.ఆర్ తో సహా చిత్రబృందం చూసుకుందని... అన్ని విధాలుగా సంతృప్తికరంగా అనిపించిందని, ఎన్టీఆర్ అభిమానులకు ఈ యాక్షన్ సీన్... ఓ పండగ లాంటిదని తెలుస్తోంది. మరి ఆ సీన్ ఎలా వచ్చిందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
హీరోలు పులులతో, సింహాలతో తలపడి... వాటిని మట్టికరిపించడం, ఆ ధీరోదాత్తత చూసి అభిమానులు పులకించిపోవడం కొత్తేం కాదు. పాత సినిమాల నుంచీ వస్తున్న సంగతే. ఇప్పుడు అలాంటి సన్నివేశాల్ని తీయడానికి, నటించడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. అయితే.. చాలా కాలం తరవాత...`ఆర్.ఆర్.ఆర్`లో ఇలాంటి ఓ యాక్షన్ సీక్వెన్స్‌ని చూసే అవకాశం దక్కుతోంది. మిగిలిన సినిమాల్లో హీరో - పులులు, సింహాలతో తలపడితే, పిచ్చ కామెడీ చేసుకోవచ్చు గానీ, ఇది రాజమౌళి సినిమా కాబట్టి.. నిజంగానే రోమాంటిఛితంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. ఎందుకంటే.. రాజమౌళి తన కథల్లో హీరోని దేవుడి కంటే బలవంతుడిగా చూపిస్తాడు కాబట్టి, ప్రేక్షకులు తలాడించేయడం ఖాయం.